Queen victorian era: క్వీన్ విక్టోరియా కాలం నాటి అత్యంత పలుచని భవనం అమ్మకం..ధర వింటే ఆశ్చర్యమే

  • Feb 09, 2021, 20:21 PM IST

 

Queen victorian era: ఈ ఇంటిని 2006లో అమ్మేశారు. ఆ సమయంలో 4 లక్షల 88 వేల 5 వందల యూరోలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ధర అమాంతం పెరుగుతోంది. ఇప్పుడు 1.1 మిలియన్ అంటే 11 లక్షల యూరోలకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో 9 కోట్ల 70 లక్షల 93 వేల 7 వందల రూపాయలకు సమానమది.

1 /5

ఈ ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ రెండవ అంతస్థు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్లోర్‌లోనే బెడ్రూమ్, స్టడీ‌రూమ్ ఉన్నాయి. కప్పుకు ఓ చిమ్నీ కూడా ఉంది. ఈ ఇళ్లు తెల్లటి ఇంటీరియర్‌తో ఉంది. అయితే ఈ ఇంట్లో నివాసం ఉండలేరు.  గతంలో 2006లో ఈ ఇంటిని విక్రయించారు. 

2 /5

ఈ ఇంట్లో అన్నింటికంటే పలుచనిది కిచెన్. కానీ ఎలా నిర్మించారంటే..చూడ్డానికి స్పేసియస్‌గా ఉంటుంది. అయితే డైనింగ్ ఏరియా రెండింతలు వెడల్పుగా కన్పిస్తుంది. ముందు భాగంలోనే ఈ ఇళ్లు పల్చగా ఉంటుంది..వెనుక భాగంలో మాత్రం వెడల్పుగా ఉంటుంది.  ఈ ఇంటి వెనుక భాగం 16 అడుగులతో గార్డెన్ ఏరియా కలిగి ఉంది. 

3 /5

ఈ ఇంటిని అమ్ముతున్న కంపెనీ చెబుతున్న దాని ప్రకారం..మొదట్లో ఈ ప్రాపర్టీ విచిత్రంగా కన్పించిందట. ఎవరికీ దీనిపై ఆసక్తి ఉండదని అనుకున్నారట. కానీ ఈ ఇంటి చరిత్ర తిరగేసినప్పుడు..ఆశ్చర్యపోయారట. ఈ బిల్డింగ్ స్థలాలకు డిమాండ్ ఏ మాత్రం లేనప్పుడు నిర్మించారట. ఆ సమయంలో ఇళ్లు నిర్మించినవారి అభిరుచి అలా ఉండేదేమో. అన్నట్టు ఈ ఇంటిలో అన్ని వసతులున్నాయి. 

4 /5

అవును మరి. రెడ్ మార్క్ మధ్యలో కన్పిస్తున్న నీలి రంగు బిల్డింగు కేవలం 5.6 అడుగుల వెడల్పు మాత్రమే. కానీ దీని ధర మాత్రం 1.1 మిలియన్ యూరోలకు చేరుకుంది. అయితే ఈ బిల్డింగ్ విక్టోరియా కాలం నాటిది. ఈ బిల్డింగ్ 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మితమైంది. ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. 

5 /5

ప్రజల కోర్కెలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఓ సమయంలో చిన్నది, పలుచని బిల్డింగ్ అనే కారణంతో ఎవరూ కొనుగోలుకు ముందుకొచ్చేవారే కాదు. ఇప్పుడు మాత్రం దీని ధర పదికోట్లకు చేరుకుంది. ఒకవేళ కొనుగోలుదారుల్లో ఉత్సాహం ఉంటే..ఇంకా పెరగవచ్చు కూడా. ఇంటి సైజ్ ఏంటనుకుంటున్నారా..రెడ్ మార్క్‌లో ఉన్నదే అసలు ఇళ్లు. మొత్తం కానే కాదు.