Rahu Nakshatra Parivartan Effect On Zodiac Sign: గ్రహాలు, నక్షత్రాలు వ్యక్తుల జీవితాలపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి గ్రహాలు రాశి, నక్షత్ర సంచారం చేసిన ప్రతిసారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ గ్రహాలు జాతకాల్లో ఉన్న స్థానాలను బట్టి శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. జాతకంలో గ్రహాలు అశుభస్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. అదే శుభస్థానంలో ఉంటే బోలెడు లాభాలు కలుగుతాయి.
అన్ని గ్రహాల్లోకెళ్ల రాహువు గ్రహం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ గ్రహం ఒకరాశిలోకి వెళ్లడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో వెల్లడించారు. ఇదిలా ఉంటే హోళీ పండగ రోజు పూర్ణభాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది.
రాహువు గ్రహం పూర్ణభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మార్చి 14వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులవారికి డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు..
రాహు సంచారం ఎఫెక్ట్ కారణంగా మీన రాశివారికి వ్యక్తిగత జీవితంలో సానుకూల ప్రభావం మొదలవుతుంది. వీరికి అకస్మాత్తుగా ఊహించని డబ్బు వస్తుంది. అంతేకాకుండా మంచి పనులు చేసేవారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు.
రాహువ నక్షత్ర సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి వృత్తిపరమైన జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కుటుంబంతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు.
రాహువు నక్షత్ర సంచారంతో వృషభ రాశి వారి జీవితాల్లో కూడా ఊహించని మార్పులు సంభవిస్తాయి. వీరికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. మానసిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.