Rain Alert: నేడే తుఫాను.. మూడు రోజులు భారీ వర్షాలు, ఐఎండీ బిగ్‌ అలెర్ట్‌..

Rain Alert In Andhra Pradesh: తుఫాను వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. నేడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను మారనుంది.
 

1 /5

గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా 'ఫెంగల్‌' తుఫాను వల్ల మూడు రోజులు వర్షాలు కురుస్తాయన ఐఎండీ హెచ్చరించింది.   

2 /5

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారనుంది. దీంతో ఈరోజు నుంచి మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  

3 /5

ఈ తుఫాను వల్ల ముఖ్యంగా రాయలసీమపై ప్రభావం పడుతుందని అంచనా. ఇప్పటికే రైతులను అలెర్ట్‌ చేసిన ఐఎండీ, మత్స్యకారులను కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.  

4 /5

ఇప్పటికే తమిళనాడులోని చెన్నైలో ఈ తుఫాను వల్ల ఆరెంజ్‌ అలెర్ట్ కూడా జారీ చేశారుచ ముఖ్యంగా తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూర్‌, తంజావూరు ప్రాంతాలను అలెర్ట్ చేశారు.  

5 /5

ఇండిగో కూడా తమ ప్రయాణీకులకు ప్రయాణ సూచనలు చేసింది. ఫ్లైట్స్‌ రీషెడ్యూల్‌ వివరాలను తెలిపింది. తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకల్‌ పరిసర ప్రాంతాల్లో వరదలు విజృంభించవచ్చని ఐఎండీ హెచ్చరించింది.