Raisins Benefits During Summer: వేసవికాలంలో ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Raisins Benefits During Summer: ఎండాకాలం రాగానే మనం ఎదుర్కొనే సాధారణ సమస్యలలో డీహైడ్రేషన్ ఒకటి. అధిక వేడి కారణంగా శరీరం నుండి ఎక్కువ నీరు కోల్పోవడం జరుగుతుంది, దీనివల్ల అలసట, తలనొప్పి, మైకము వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో, ఎండుద్రాక్ష ఒక అద్భుతమైన పరిష్కారం. ఎండుద్రాక్షలు పోషకాల సమృద్ధి కలిగిన డ్రై ఫ్రూట్స్, వేసవిలో శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.
ఎండుద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు. ఇందులో బోలెఉ పోషకాలు ఉంటాయి.
ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
వేసవికాలంలో తరచుగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ ఎండు ద్రాక్షలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. శారీరం బలహీనంగా ఉన్నప్పుడు ఈ ద్రాక్షను తీసుకోవడం మంచిది.
ఎండుద్రాక్షను అలెర్జీ, వేడి శరీరం వంటి వ్యక్తులు తీసుకోవడం మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.