Rakhi Sawant: ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా పాకిస్తాన్ అబ్బాయిని..!

Rakhi Sawant marriage: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమయి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా.. పాకిస్తాన్ కి చెందిన వ్యక్తితో వివాహానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇంతకీ అతనికి ఎవరు అనే విషయానికి వెళితే..

1 /5

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు. ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియదు. అయితే వివాహం అనంతరం సవ్యంగా కాపురం చేస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. చిన్నపాటి విభేదాలు వచ్చాయంటే చాలు విడాకులు తీసుకొని వేరుపడుతున్నారు. ఆ తర్వాత ఒంటరిగా జీవిస్తున్నారా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఒకవేళ తాము ఒంటరిగా ఉన్నప్పుడు తోడు అవసరం అనిపించి, ఎవరైనా తమ మనసుకు దగ్గరగా వస్తే వారిని వివాహం చేసుకుంటున్నారు. అలా ఒక హీరోయిన్ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమయ్యింది. ఆమె ఎవరు?  ఆమె చేసుకోబోయే వ్యక్తి ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం. 

2 /5

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేసే ఈమె అప్పట్లో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తన అందచందాలతో, అభినయంతో బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె , హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్లి పూర్తిగా మారిపోయింది . ఇక దాంతో ఈమె ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. సినిమాలకంటే కాంట్రవర్సీ పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు. 

3 /5

గత కొంతకాలంగా వివాదాస్పద ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రాఖీ సావంత్ తాజాగా తన మూడో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ కి చెందిన నటుడు, నిర్మాత అయిన డోడి ఖాన్ తో ఏడడుగులు వేయడానికి సిద్ధమైనట్లు తెలిపింది. 

4 /5

తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చివరికి నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు. అంటూ ఇన్స్టాల్ లో రాసుకుంది. అంతేకాదు అతడి వీడియోని కూడా పంచుకుంది. వీరి పెళ్లి పాకిస్తాన్లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారమే జరగబోతున్నట్లు సమాచారం. ఇక ఇండియాలో రిసెప్షన్ ఉంటుందని ,హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్ కు వెళ్తున్నట్లు కూడా తెలిపింది. మొత్తానికి అయితే ఇది చూసిన కొంతమంది నెటిజనులు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

5 /5

గతంలో రితేష్ సింగ్ ను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న ఈమె, ఆ తర్వాత కర్ణాటక కు చెందిన ఆదిల్ ఖాన్ దురానీని రహస్యంగా పెళ్లి చేసుకుని అతడికి విడాకులు ఇచ్చింది. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతోంది.