Ram Charan: రామ్ చరణ్ పై మండిపడుతున్న అయ్యప్ప భక్తులు.. అసలు కారణం అదేనా..


Ram Charan: రామ్ చరణ్ తెలుగులో మెగాస్టార్ తనయుడిగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. త్వరలో శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నాుడు. ఆ తర్వాత బుజ్జిబాబు సన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ .. కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదమవుతోంది.

1 /6

Ram Charan: రామ్ చరణ్.. కడప దర్గాను దర్శిస్తే తప్పేంటి అనుకుంటున్నారా.. మాములుగా ఎవరైనా ఏ మతాన్నైనా ఆరాధించవచ్చు. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల వేసుకొని రామ్ చరణ్.. దర్గాను సందర్శించడంపై అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు.

2 /6

ఇస్లామ్ మతంలో దర్గా ఓ భాగం.. అక్కడ మాములుగా ఎవరు సందర్శించినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ అయ్యప్ప స్వామి మాలలో రామ్ చరణ్ సందర్శించడంపై అయ్యప్ప స్వాములతో పాటు పలు హిందూ సంఘాలు మండిపడుతున్నారు. దర్గా అంటే ఓ సమాధి. దాన్ని సందర్శిస్తే మాలను తీసివేయాలి.  

3 /6

మరోవైపు శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా వావర్ స్వామి అనే ముస్లిమ్ భక్తుడి సమాధి కూడా ఉంది. అయ్యప్ప భక్తులు విధిగా సందర్శిస్తుంటారు. అక్కడ లేని తప్పు ఇక్కడ ఎందుకు వచ్చిందనేదే ప్రశ్న వస్తోంది.

4 /6

అయితే.. మరికొందరు స్వాములు మాత్రం.. వావర్ స్వామి అనేది ఓ కట్టుకథ. హిందూ భక్తులను తప్పు దారి పట్టించడానికే వావర్ స్వామి అనే ఓ ముస్లిమ్ భక్తుడిని సృష్టించి ఓ సమాధిని క్రియేట్ చేసినట్టు చెబుతుంటారు.

5 /6

గత కొంత కాలంగా అయ్యప్ప భక్తులు వావర్ స్వామిని దర్శించడం లేదు. అది సనాతన ధర్మంలో భాగం కాదనే ఉద్దేశ్యంతో కొంత కాలంగా వావర్ స్వామిని దర్శించుకోవడం లేదు.  మాములుగా ఉండి చర్చి, మసీదు, దర్గా ఎక్కడికి వెళ్లినా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

6 /6

కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత మండలం దీక్షతో పాటు పలు నియమాలున్నాయి. అలా మాల వేసుకొని ఎక్కడి పడితే అక్కడ తిరగకూడదనే నియమాలున్నాయి. అయ్యప్ప మాలలో దర్గా సందర్శించడంపై రామ్ చరణ్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.