Rashmika Mandanna: అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ.. గొప్ప ఎవరో తేల్చేసిన రష్మిక..!

Rashmika-Vijay: నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ముందు ఒక పెద్ద ప్రశ్న ఆమెను మరింత ఇబ్బంది పెడుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఆమె చాలా సునాయాసంగా అత్యంత తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది రష్మిక.

 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న రష్మిక మందన్న తాజాగా నటించిన చిత్రం పుష్ప 2. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది ఈ సినిమాలో పుష్పరాజు శ్రీవల్లి జోడి అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా మరొకవైపు రష్మిక విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. 

2 /5

ఇకపోతే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.అల్లు అర్జున్తో పోలిస్తే విజయ్ దేవరకొండ జూనియర్ అయితేనేమి టాలీవుడ్లో రౌడీ బాయ్ గా పేరు దక్కించుకున్నారు.పైగా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇటీవలే బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లి మరీ పలకరించారు.   

3 /5

ఇక వీరిద్దరి నటనతో పాటు స్టైల్ లో కూడా చాలా పోలికలు ఉన్నాయి .ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్న నేషనల్ క్రషర్ రష్మిక మందన్నకు ఎదురయింది. దీనిపై రష్మిక సమాధానమిస్తూ.. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా వండర్తో సమానం.  

4 /5

వీరిద్దరూ కూడా మన దేశ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుల్లో నిలుస్తారు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల గురించి నాలాంటి నటిని అభిప్రాయం అడగడం సరైన పద్ధతి కాదు.

5 /5

ఇతరుల ప్రతిభతో సమానమైన వారికే వారి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు అధికారం ఉంటాయి. కాబట్టి వాళ్ళిద్దరి టాలెంట్ పై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదంటూ చాలా తెలివిగా సమాధానం తెలిపింది. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.