Threat for Rashmika Mandanna : రష్మిక మందాన ప్రస్తుతం హిందీ సినిమాలతో సైతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఇప్పుడు..హిందీ సినిమాలే కొన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. ఏకంగా హై సెక్యూరిటీ చుట్టు పెట్టుకోవలసిన అవసరం కూడా తీసుకొచ్చాయి. ఇది మొత్తం జరిగింది ఒక స్టార్ హీరో వల్ల. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ కి గత కొన్ని రోజులుగా హత్యా బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తన ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఒక లైసెన్స్డ్ రివాల్వర్ తో పాటు రూ .2కోట్ల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయన కొనుగోలు చేశారు.
అంతేకాదు హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పుడు బిష్ణోయ్ వర్గం నుండి తనను తాను కాపాడుకోవడం కోసం ఏకంగా 60 మంది అత్యంత టైట్ సెక్యూరిటీ మధ్య ఆయన హోస్టుగా బిగ్ బాస్ కి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత బాబా సిద్ధిఖీ మరణం తర్వాతే సల్మాన్ ఖాన్ కి ప్రాణభయం చుట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి తాను ఒప్పుకున్న సికిందర్ సినిమా షూటింగ్ ను కూడా ఆపేశారు. ఇదిలా ఉండగా ఇలా అయితే కష్టమని భావించిన అత్యంత భద్రత మధ్య బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్లకు వెళ్లి వస్తున్నారు. దీనికి తోడు సికిందర్ సినిమా షూటింగ్ కూడా సెక్యూరిటీ మధ్య మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ మొదలు పెడుతున్న నేపథ్యంలో రష్మికకి కూడా భారీ మొత్తంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసే పనిలో చిత్ర బృందం ఉందని బాలీవుడ్ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి సల్మాన్ ఖాన్ పోస్టర్ ఒకటి విడుదల చేయగా.. ఆ పోస్టర్ కి ప్రేక్షకులలో భారీగానే స్పందన లభించింది.
మరోవైపు సల్మాన్ ఖాన్.. నేషనల్ క్రష్ రష్మిక కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు సల్మాన్ ఖాన్. ఇప్పుడు ఈయన కారణంగానే అటు రష్మికకి కూడా భద్రత కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంత హై సెక్యూరిటీ మధ్య ఈ సికిందర్ సినిమా షూటింగ్ ఎలా పూర్తి చేస్తారో చూడాలి.