Realme Neo 7 SE Price: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
రియల్‌మీ కంపెనీ నియో 7 SE (Realme Neo 7 SE)సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది అత్యంత శక్తివంతమైన Dimensity 8400-Max ప్రాసెసర్‌తో అందుబాటులోకి విడుదల చేయబోతోంది. అంతేకాకుండా అత్యాధునిక 8-కోర్ ఆర్కిటెక్చర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది.
ఈ నియో 7 SE (Realme Neo 7 SE) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైతే..ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Turbo 4కి పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రియల్‌మీ విడుదల చేసే మొబైల్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
ఈ రియల్‌మీ నియో 7 SE స్మార్ట్‌ఫోర్ 6000-నిట్ ఐ-కేర్ డిస్‌ప్లేతో విడుదల కాబోతున్నట్లు లీక్ అయిన ఫీచర్స్‌లో వెల్లడించారు. దీనిని కంపెనీ ముందుగా మార్కెట్‌లోకి మూడు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత కొత్త కలర్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.
నియో 7 SE స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దీని డిస్ల్పే 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో విడుదల చేయనుంది. దీంతో పాటు ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది..
ఈ (Realme Neo 7 SE) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 16 GB ర్యామ్‌తో పాటు 1 TB ఇంటర్నల్ స్టోరేజ్‌లో విడుదల కానుంది. దీంతో పాటు 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. అలాగే ఇందులోని ప్రధాన కెమెరా 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు అదనంగా 50-మెగాపిక్సెల్, 8-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.