Fridge Precautions: ఈ పొరపాట్లు చేస్తే ఫ్రిజ్ కూడా బాంబు పేలినట్టు పేలుతుంది జాగ్రత్త

రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పిస్తుంది. తిండి పదార్ధాలు పాడవకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. చల్లని నీళ్ల కోసం వినియోగిస్తుంటారు. అయితే ఫ్రిజ్ వినియోగం విషయంలో కాస్త అప్రమత్తత ఉండాలి. సరైన విధానంలో వినియోగించకుంటే బాంబు పేలినట్టు పేలే ప్రమాదం లేకపోలేదు

Fridge Precautions: రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పిస్తుంది. తిండి పదార్ధాలు పాడవకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. చల్లని నీళ్ల కోసం వినియోగిస్తుంటారు. అయితే ఫ్రిజ్ వినియోగం విషయంలో కాస్త అప్రమత్తత ఉండాలి. సరైన విధానంలో వినియోగించకుంటే బాంబు పేలినట్టు పేలే ప్రమాదం లేకపోలేదు
 

1 /5

ఫ్రిజ్ క్లీనింగ్ ఫ్రిజ్ ఎక్కువగా వినియోగిస్తుంటే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా చేస్తుండాలి. క్లీన్ చేస్తుండాలి. లేకపోతే ఫ్రిజ్‌లో వ్యర్ధాలు పేరుకుని చెడు వాసన వస్తుంది

2 /5

షార్ట్ సర్క్యూట్ ఫ్రిజ్‌లో ఎలక్ట్రిక్ పరికరాల్లో షార్ట్ సర్క్యూట్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే ఫైర్ అయ్యే ప్రమాదముంది. అందుకే ఫ్రిజ్ వైర్లను పరిశీలిస్తుండాలి. ఏదైనా పాడయినట్టన్పిస్తే వెంటనే మార్చేయాలి

3 /5

కంప్రెషర్ రిఫ్రిజిరేటర్‌లో అతి ముఖ్యమైంది కంప్రెషర్. ఫ్రిజ్‌ను కూల్ చేసేది ఇదే. ఇది పాడయితే గ్యాస్ లీక్ జరుగుతుంది. పేలుడు ప్రమాదం పెరగవచ్చు. అందుకే కంప్రెషర్ చెక్ చేస్తుండాలి

4 /5

గోడకు ఆన్చకూడదు ఎప్పుడూ ఫ్రిజ్‌ను ఇంట్లో గోడకు తగిలించి ఉంచకూడదు. ఫ్రిజ్ వెనుక భాగానికి గోడకు మధ్య కాస్త గ్యాప్ అవసరం. తద్వారా గాలి ఫ్రీగా చొరబడే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా కంప్రెషర్‌పై ఒత్తిడి పడకుండా ఉంటుంది. 

5 /5

హై వోల్టేజ్ ఫ్రిజ్‌కు ఒకేసారి అధిక వోల్టేజ్ వచ్చిందంటే పాడయ్యే అవకాశాలున్నాయి. ఒక్కోసారి పేలవచ్చు కూడా. వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు స్టెబిలైజర్ వాడటం మంచిది