Harish Rao: మాట తప్పిన రేవంత్‌.. పాపం తగలకుండా హరీశ్ రావు ఆలయాల యాత్ర

Harish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్‌ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. రేవంత్‌ ప్రమాణం చేసిన ప్రతి ఆలయాన్ని సందర్శించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని హరీశ్ రావు పూజలు చేయించారు.

1 /8

Harish Rao At Yadadri: తెలంగాణలో హరీశ్‌ రావు కేంద్రంగా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రుణమాఫీ విషయంలో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు.

2 /8

Harish Rao At Yadadri: రుణమాఫీ చేస్తానని రేవంత్‌ రెడ్డి ఒట్టేసిన దేవుళ్ల వద్దకు హరీశ్ రావు వెళ్తున్నారు. మొదట యాదాద్రి ఆలయంతో ప్రారంభించారు.

3 /8

Harish Rao At Yadadri: స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని.. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ యాదాద్రిలోని  తూర్పు రాజ గోపురం వద్ద  పాప పరిహార పూజలు నిర్వహించారు.

4 /8

Harish Rao At Yadadri: రేవంత్‌ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు చేశారు.

5 /8

Harish Rao At Yadadri: ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.

6 /8

Harish Rao At Yadadri: మాట తప్పిన రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు.

7 /8

Harish Rao At Yadadri: యాదాద్రి పర్యటనలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, మాజీ విప్ గొంగిడి సునీత తదితరులు ఉన్నారు.

8 /8

Harish Rao At Yadadri: యాదాద్రికి వచ్చిన హరీశ్‌ రావు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు ఘన స్వాగతం లభించింది.