Sai Pallavi: ఏకంగా అలాంటి సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..!

Sai Pallavi upcoming movie:  న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలో ఒక్క తమిళ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో చెప్పకు తప్ప విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో హీరోగా ఒక బోల్డ్ హీరో నటించడమే. ప్రస్తుతం ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

1 /5

సాయి పల్లవి పేరు వినగానే తెలుగు, తమిళ, మలయాళ సినీప్రేక్షకులు లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు. ఆమె తన సహజమైన అభినయం, డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ‘ప్రేమమ్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ‘ఫిదా’ చిత్రంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస విజయాలతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించబోతోందని సమాచారం.  

2 /5

తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో శింబు (STR) నటిస్తున్న ‘STR 49’ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనుండగా, డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై వేగంగా కొనసాగుతోంది.  

3 /5

శింబు సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని, గతంలో నటించిన హీరోయిన్‌లతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో సాయి పల్లవి అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆమె ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా శింబు  సినిమాలో తప్పకుండా అలాంటి సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సీన్స్ సాయి పల్లవి ఒప్పుకొని సైన్ చేసిందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

4 /5

అయితే తప్పకుండా ఆమె అలాంటి సీన్స్ ఒప్పుకో ఉండదని.. శింబు సినిమాలో కూడా పద్ధతిగా కనిపించే హీరోయిన్ సాయి పల్లవి అవుతుందని అంటున్నారు ఎంతోమంది. మొత్తానికి ఇప్పటివరకు బలమైన పాత్రలను ఎంచుకుని, తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి, ఈ సినిమాలో ఎలా కనిపించనుందో వేచి చూడాలి. ఆమె ఎలాంటి పాత్రలో కనిపించనుందన్నది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, సినిమా సెట్స్‌లోని కొన్ని లీక్ అయిన ఫోటోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.  

5 /5

సాయి పల్లవి కొత్త సినిమా గురించి అన్ని కోణాల్లోనూ ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ మార్కెట్‌ను మరింతగా ఆకర్షించే ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఆమె అభిమానులు మాత్రం ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆమెకు మరిన్ని విజయాలు తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది త్వరలోనే తెలుస్తుంది.