Sai Pallavi Varanasi trip: సాయిపల్లవి వారణాసికి వెళ్లి అక్కడ విశ్వనాథుడ్ని, అన్నపూర్ణ దేవీ ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సాయిపల్లవి ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. అమరన్ మూవీ వివాదంలో తెగ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరొవైపు నటి రామాయణం సినిమాపై కూడా కాంట్రవర్సీ చెలరేగింది.
కొంత మంది సాయి పల్లవి పూర్తిగా వెజిటెరియన్ అయ్యారని, ఆమె నాన్ వెజ్ ముట్టుకొవడం, బైట తినడం వంటివి మానుకున్నారని కూడా ట్రోల్స్ చేశారు. అయితే.. తాజాగా, నటి సాయి పల్లవి ఇటీవల ఆస్ట్రేలియాకు కూడా వెళ్లారు.
నార్మల్ గా అందరు బీచ్ లకు వెళ్లినప్పుడు.. తమ ఫ్రెండ్స్ లతో, బికీనీలలో కన్పిస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం..తన చెల్లెలితో బీచ్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశారు. రీసెంట్ గా సాయి పల్లవి వారణాసి వెళ్లినట్లు తెలుస్తొంది.
నటి సాయి పల్లవి వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడ్ని,అన్నపూర్ణదేవీని దర్శించుకున్నారు. అంతే కాకుండా.. అక్కడ ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా గంగాదేవీ నటి దగ్గర కూడా వెళ్లి పూజలు చేశారు.
సాయిపల్లవి కుంకుమ పెట్టుకుని,చేతికి రుద్రాక్షల దండతో పాటు, మెడలో స్వామి వారిప్రసాదం బంతి పూల మాలతో కన్పిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం సాయి పల్లవి లెటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా సాయి పల్లవి చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తొంది. నాగచైతన్యతో కలిసి చేసిన తండేల్ మూవీ అభిమానుల ముందుకు రానుంది. అదే విధంగా రామయణ సినిమా కూడా.. రెండు బాగాలుగా ఆడియన్స్ ముందుకు రానుందంట. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ రామయ్యగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే.