Gold Rate Today: అదిరిపోయే వార్త అక్కో..బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతుందంటే?

Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఆదివారం పెరిగిన ధర..నేడు సోమవారం భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర సుమారు 100 రూపాయలు వరకు దగ్గింది. ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి 84వే రూపాయల నుంచి రూ. 76వేలకు బంగారం ధర పడిపోయింది. దీంతో బంగారం ధర రికార్డు స్థాయి నుంచి భారీగా తగ్గుదలకు గురయ్యింది. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయో చూద్దాం. 
 

1 /6

24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,611గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 70.990గా ఉంది. బంగారం ధరలు తగ్గడానికి కారణం ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులే అని చెప్పవచ్చు.   

2 /6

బంగారం ధరలు తగ్గానికి ప్రధాన కారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడల్లా బంగారం ధర తగ్గుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ చరిత్రలోనే గరిష్టంగా 85 రూపాయలను దాటింది. ఇది ఓ కారణమనే చెప్పవచ్చు. 

3 /6

బంగారం ధర తగ్గడానికి మరో కారణం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత రక్షణాత్మక వ్యవహార శైలి తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లో పాటిటివ్ గా స్పందిస్తాయి. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.   

4 /6

చైనా సెంట్రల్ బ్యాంకు వంటి కీలక బ్యాంకులు ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడం తగ్గించాయి. ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర తగ్గడానికి మరో కారణంగా చెప్పవచ్చు. డిమాండ్ తగ్గడం వల్ల కూడా బంగారం ధర తగ్గుతుందని చెప్పవచ్చు. 

5 /6

అమెరికాలో కీలకమైన సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుమారు పావు శాతం తగ్గించింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగా పతనం అవుతున్నాయి.   

6 /6

అయితే బంగారంను సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భారతీయులు పరిగణిస్తారు. బంగారంపై పెట్టుబడి పెట్టి భారీ లాభాలను తెచ్చిపెడుతుందని నమ్ముతుంటారు.