Sai Pallavi or Rashmika : సాయి పల్లవి రష్మిక లలో ఎవరు నెంబర్ వన్ హీరోయిన్ అనే విషయాం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. వీరిద్దరికీ కూడా.. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా క్రెజ్ కూడా ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోయిన్ గొప్ప అంటే తమ హీరోయిన్ గొప్ప అని వాదించుకుంటున్నారు. కానీ మొత్తం పైన చూసుకుంటే ఎవరు టాప్ వన్ లో ఉన్నారో ఒకసారి చూద్దాం..
స్టార్ హీరోల మధ్య కాకుండా హీరోయిన్స్ మధ్య కూడా నెంబర్ వన్ వార్ అనేది అభిమానుల మధ్య జరుగుతూ ఉంటుంది. అలా టాలీవుడ్లో సాయి పల్లవి, హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇతర భాషలలో కూడా నటిస్తూ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నవారిలో వీరు కూడా ఒకరనే చెప్పవచ్చు. ప్రస్తుతమైతే ఇద్దరు హీరోయిన్స్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి అందం విషయంలో, నటన విషయంలో ఎవరికి వారు ఏమాత్రం తగ్గడం లేదు. అలాంటి వీరిద్దరిలో ఎవరు నెంబర్ వన్ అని చెప్పడం కూడా అంతే కష్టంగానే మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రష్మిక యానిమల్, పుష్ప 2 చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నది.. సాయి పల్లవి అమరన్, తండేల్ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎక్కువగా రష్మికకి ఆధిపత్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసేలా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో అగ్ర హీరోలతో తన సినిమాలను చేస్తూ ఉంది రష్మిక. అందుకే ఈమె నెంబర్ వన్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాయి పల్లవి విషయానికి వస్తే.. నటనపరంగా అందరిని ఆకట్టుకుంటుంది. తన ప్రాజెక్టులను కూడా ఎప్పుడూ సెలెక్టివ్ గానే ఎంచుకుంటూ ఉంటుంది. ఈమెకు పాత్ర నచ్చకపోతే ఆఫర్లను కూడా తిరస్కరిస్తుంది.. రష్మిక లాగా పాన్ ఇండియా చిత్రాలను సాయి పల్లవి అంగీకరిస్తే ఆమెను అధికంమించగలరని చెప్పవచ్చు. కానీ సాయి పల్లవి కేవలం తన క్యారెక్టర్ కు తగ్గట్టుగానే పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న రామాయణం సినిమాలో నటిస్తూ ఉన్నది. ఇందులో రణబీర్ కపూర్ రాముడు గా నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి నటిస్తున్నది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రామాయణం సినిమా క్లిక్ అయితే బాలీవుడ్ లో కూడా సాయి పల్లవి మార్కెట్ పెరిగిపోతుందని చెప్పవచ్చు. స్టార్డం అనేది కొంతకాలం తర్వాత తగ్గిపోయినా కానీ సినిమాలలోని పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.