Samantha marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. వచ్చే యేడాది తాను ఎలా ఉండబోతోంది? తన జీవితంలో ఏం జరగబోతోంది? అనే విషయాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ..అందరిని ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించిన హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని, కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది.. అయితే ఈ విషయం అభిమానులనే కాకుండా సినీ సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక ఈనెల నాలుగవ తేదీన నాగచైతన్య శోభిత అనే మరొక హీరోయిన్ ని ప్రేమించి, వివాహం చేసుకున్నారు. దీంతో గత కొంతకాలంగా అటు సమంత కూడా మరొక వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి.
ఇలాంటి సమయంలోనే సమంత..తనకు కాబోయే భర్త గురించి కొన్ని నిజాలు బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక విషయాన్ని తెలియజేసింది. ఒక ఏడాది నువ్వు గెలవవచ్చు.. మరొక ఏడాది నీ క్యారెక్టర్ గెలవవచ్చు.అంటూ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది.
అంతటితో ఆగకుండా 2025లో తన గురించి కొన్ని విషయాలను కూడా తెలియజేసింది సమంత. వచ్చే ఏడాది నువ్వు బిజీగా ఉండవచ్చు.. నువ్వు నీ వృత్తిలో అభివృద్ధితోపాటు డబ్బు కూడా సంపాదించవచ్చు.. నమ్మకమైన ప్రేమించేవాడు రావచ్చు.. పిల్లలు కూడా నీ లైఫ్ లోకి రావచ్చు అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ని రాసుకుంది..
అయితే ఈ విషయాన్ని మూడు రాశులకు సంబంధించి, ఆ రాశులకు పోస్ట్ చేసింది సమంత.. అందులో వృషభం, వృశ్చికం, కన్యరాశులను ఉద్దేశిస్తూ సమంత ఇలా ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకుంది. అయితే అందులో ప్రేమించేవాడు కావాలి.. పిల్లలు కూడా కావాలి అంటూ రాసుకు వచ్చింది సమంత..
ఇటీవల శోభిత నాగచైతన్య పెళ్లి అయిన తర్వాత వారం రోజులు కూడా కాకముందే సమంత నుండి ఈ పోస్ట్ రావడంతో.. సోషల్ మీడియాలో సమంత పెళ్లి రూమర్స్ మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. మరి అభిమానులు కోరుకున్నట్టుగానే సమంత పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుందేమో చూడాలి మరి.