Samantha Cryptic Post: సినిమాలతోనే కాదు తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది స్టార్ హీరోయిన్ సమంత. ముఖ్యంగా సమంత ఇంస్టాగ్రామ్ ని ఫాలో అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో ఆమె ఎటువంటి పోస్ట్ పెట్టిన దానికి వందల లైకులు వస్తూ ఉంటాయి.
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కానీ ఇంస్టాగ్రామ్ కు మాత్రం గ్యాప్ ఇవ్వదు హీరోయిన్ సమంత. తను ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే చాలు.. దానికి వందల కొద్ది లైకులు వస్తూ ఉంటాయి. అంతేకాదు కొన్నిసార్లు తాను పెట్టే పోస్టుకి అర్థం కూడా సరిగ్గా అర్థం కాదు. ఈ క్రమంలో ఈ మధ్య సమంతా పెట్టిన ఒక పోస్ట్ ఎదో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
సమంత రూత్ ప్రభు ఇటీవల తన మూడు రోజుల మౌన యాత్ర గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ప్రయాణాన్ని ఆమె జీవితాన్నే మార్చేసిన అనుభవంగా అభివర్ణించారు. ఫోన్ లేకుండా, ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, పూర్తిగా తనతోనే గడిపిన సమయం ఎంతో విలువైనదని తెలిపారు.
“మూడు రోజులు పూర్తిగా మౌనం. ఫోన్ లేదు. మాటలు లేవు. తానే తనకు తోడు. మనం మనతోనే ఒంటరిగా గడపడం భయంకరంగా మారింది. కానీ, మళ్లీ అలా చేయమంటాడా? లక్షసార్లు అవును. మీరు ప్రయత్నించాలా? లక్షసార్లు అవును అని అంటాను" అని ఆమె పేర్కొన్నారు.
సమంత గత కొన్ని రోజులుగా ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం, ఫిట్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రయాణాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవల ఆమె చెన్నైలో జరిగిన ఓ కళాశాల వేడుకలో పాల్గొని తన హిట్ సాంగ్ 'డిప్పం డప్పం'పై విద్యార్థులతో కలిసి స్టేజ్ పై డాన్స్ వేశారు.
సమంత చివరిగా ‘Citadel: Honey Bunny’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్‌లో ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది. కే.కే. మేనన్, సిమ్రాన్, సికందర్ ఖేర్ వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో ఉన్నారు. ఇక, సమంత త్వరలోనే ‘రక్త బ్రహ్మాండ: ది బ్లడి కింగ్‌డమ్’ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె ఆదిత్య రాయ్ కపూర్, వామిఖా గబ్బి, అలీ ఫజల్ వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఏమిటంటే, సమంత ‘మా ఇంటి బంగారం’ అనే తెలుగు సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించనుంది. 2023లో విడుదలైన ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన తర్వాత, ఇది ఆమె తెలుగు రీఎంట్రీ మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.