Samantha Sister: ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్, సమంత ను సోదరి అని పిలవడం చాలా ఇష్టం అని చెప్పడంతో.. వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. దీనిపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా సినీ సెలబ్రెటీలన్న తర్వాత ఫ్రెండ్స్ గా ఉండడం సర్వసాధారణం. అయితే అందులో కొంతమంది మాత్రమే తమ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో హీరోయిన్స్ గా మంచి పాపులారిటీ సంపాదించిన సమంత, కీర్తి సురేష్ కూడా ఒకరు.
వీరిద్దరూ మూడు చిత్రాలలో కలిసి నటించడం జరిగింది. ఒక చిత్రంలో అయితే ఏకంగా ఫుల్ లెన్త్ రోల్ లోనే కనిపించారు. దీంతో అప్పటినుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారట. ఇకపోతే కీర్తి సురేష్ ఇప్పటికే సమంత పైన తనకున్న ఇష్టాన్ని సైతం ఎన్నో సందర్భాలలో తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరొకసారి సమంత ను పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తోంది.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సమంతకు కీర్తి సురేష్ ఒక సర్ప్రైజ్ వాయిస్ ని కూడా పంపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సమంత నీతో ఉన్న ఈ అనుబంధాన్ని సైతం ఎలా వర్ణించుకోవాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసి ఉన్నట్టుగా అనిపిస్తోందని తెలిపింది.
“నాకు ఎన్నో విషయాలలో స్ఫూర్తిగా నిలిచావు. అందుకే నిన్ను నా స్నేహితురాలు అనడం కంటే సిస్టర్ అని పిలవడమే నాకు చాలా ఇష్టం,” అని తెలిపింది కీర్తి సురేష్. జీవితంలో ఎన్నో సవాళ్లు ఫేస్ చేసి ధైర్యంగా నిలబడ్డావు. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉన్నది. నీకు జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా అంతకంటే రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు అంటూ తెలియజేసింది కీర్తి సురేష్.. సమంత కూడా ఈ విషయాలు అన్నిటికీ థాంక్స్ చెప్పడం జరిగింది.. అయితే వీరిద్దరూ కలిసి మహానటి, సీమ రాజా వంటి చిత్రాలలో నటించారు. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ వెనక కూడా సమంత హస్తము ఉందని తెలిపింది.
ఇకపోతే సమంత ను కీర్తి సురేష్ స్నేహితురాలు అనడం కంటే సోదరి అనడమే.. ఇష్టం అని చెప్పడంతో ఇక అప్పటినుంచి సమంతా, కీర్తి సురేష్ అక్క చెల్లెల అంటూ వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు కానీ సమంతను కీర్తి సురేష్ సోదరి కంటే ఎక్కువగానే భావిస్తుందని చెప్పవచ్చు.