Samsung Galaxy S22 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రారాజు శాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 , ఎస్ 22 అల్ట్రా పేర్లతో రెండు మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండింటి ధరలు, ప్రత్యేకతలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇక ధరల విషయంలో..గెలాక్సీ ఎస్ 22 8 వందల డాలర్లు కాగా, గెలాక్సీ ఎస్ 22 ప్లస్ వేయి డాలర్లుగా ఉంది. గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా మోడల్ 12 వందల డాలర్లుగా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్ 22 ప్లస్, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా మోడల్స్ కోసం ప్రీ బుకింగ్స్ ఇండియాలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న ఇండియన్ మార్కెట్‌లో రావచ్చు.
గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా 6.8 అంగుళాలతో డైనమిక్ ఎమోల్డ్ 2 ఎక్స్ డిస్‌ప్లే కలిగి ఉంది. 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌తో వస్తోంది. ఇది కూడా ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్, పింక్, గోల్డ్, బర్గండీ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్‌లతో వస్తోంది. ర్యామ్ కూడా 8 జీబీ, 12 జీబీల్లో ఉంటుంది.
గెలాక్సీ ఎస్ 22 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డైనమిక్ ఎమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్, పింక్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్‌తో 8 జీబీ ర్యామ్ కలిగి ఉంది. ఇందులో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌లు ఉన్నాయి.
గెలాక్సీ ఎస్ 22 అనేది 6.1 ఇంచెస్ డైనమిక్ ఎమోల్డ్ 2 ఎక్స్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ దీని ప్రత్యేకత. స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 1 ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్, పింక్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.