Sankranthi Movies: ఈ సంక్రాంతికి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సాధించింది? ఏ సినిమా ఈసారి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది? ఈ సినిమాలు ఎంతవరకు రికవరీ చేశాయి వాటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా పండగ వాతావరణం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల్ని మెప్పించి సంక్రాంతి ఈ విజేతగా నిలిచింది. మరోవైపు డాకు మహారాజ్ సినిమా పరవాలేదనిపించగా.. గేమ్ చేంజర్ మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది.
సంక్రాంతి పండగ సీజన్‌లో విడుదలైన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నం’ ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకుంది. ఈ సినిమా రికవరీ రేటు ఏకంగా 196%. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా ఈ చిత్రం అన్ని సెంటర్లలోనూ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది.
వరుసగా సూపర్ హిట్ సినిమాలతో కెరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకు వెళుతున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహారాజ్ 89% రికవరీతో మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు మెప్పించినా.. ఈ సినిమా సంక్రాంతి విజేతగా మాత్రం నిలవలేకపోయింది.
అనుకున్నట్టుగా ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర జాడ లేకుండా పోయింది. కేవలం 42% రికవరీతో డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి డిజాస్టర్ గా నిలిచింది.
సంక్రాంతి సీజన్ లో మరోసారి టాలీవుడ్ హవా అయితే బాగానే కనిపించింది. భారీ అంచనాల మధ్య స్టార్ హీరో తో పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన సినిమా డబుల్ డిజాస్టర్ కాగా.. తక్కువ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది.