Sankranthiki Vasthunnam 1st Day Collection: బాక్సాఫీస్ దగ్గర వెంకీ మామ మాస్ రచ్చ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..!


Sankranthiki Vasthunnam 1st Day Collection: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్ లో వెంకటేష్, అనిల్ రావిపూడిది ముందు వరుసలో ఉంటుంది. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు అతిపెద్ద విజయాన్ని సాధించాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకున్నారు.

1 /7

Sankranthiki Vasthunnam 1st Day Collection: సంక్రాంతి కానుకగా సంక్రాంతి రోజే విడుదలైన  ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంక్రాంతి పండగ బాగానే కలిసొచ్చింది. అంతేకాదు విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.

2 /7

వెంకటేష్ గత చిత్రం ‘సైంధవ్’ టోటల్ గా రూ. 10 కోట్ల లోపే షేర్ సాధించి హీరోగా వెంకటేష్ ఇమేజ్ ను డైలామాలో పడేసింది. ఈ నేపథ్యంలో వచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తొలి రోజు వెంకటేష్ కెరీర్ లోనే సోలో హీరోగా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

3 /7

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. ఇల్లాలు, ప్రియురాలు మధ్య నలిగే పాత్రలో వెంకటేష్ తనదైన కామెడీ పండించారు.  

4 /7

అనిల్ రావిపూడి ఈ సినిమాకు పెద్దగా కథ లేకపోయినా.. తనదైన కామెడీ, స్క్రీన్ ప్లేతో లాజిక్ ను పక్కన పెట్టి హిల్లేరియస్ గా తెరకెక్కించారు. అది తెరపై వర్కౌట్ అయింది. కొంత మంది ఈ సినిమాను చూసి వెండితెరపై చూసిన జబర్ధస్త్ స్కిట్ అనే కామెంట్స్ చేస్తున్నారు.

5 /7

ఆ సంగతి పక్కన పెడితే.. పండక్కి కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన కావాల్సినంత వినోదాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

6 /7

‘సంక్రాంతి వస్తున్నాం’  సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా $ 1 మిలియన్ డాలర్ కు చేరువలో ఉంది.  ఇక ఓవరాల్ గా రూ. 28 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా వెంకటేష్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు 70 శాతం రివకరీ సాధించింది.

7 /7

ఈ రోజుతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని 2025లో తొలి హిట్ గా నిలవడం ఖాయం. ఈ సినిమాకు వచ్చిన టాక్ తో ఈ సినిమా మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలను అందుకుంటుందో చూడాలి మరి.