SBI Customers ATM Alert: ఎస్బీఐ కస్టమర్స్‌ తెలుసుకోవాల్సిన అలర్ట్

SBI Debit cards rules: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాల నుండి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త ఏటీఎం రూల్స్ తో ఖాతాదారుల డబ్బు మరింత భద్రంగా ఉండటంతో పాటు ఏటీఎంలలో లావాదేవీలకు సైతం భద్రత పెరగనుందని ఎస్బీఐ స్పష్టంచేసింది.

  • Aug 25, 2022, 21:24 PM IST

SBI Debit cards rules: ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కార్డ్ హోల్డర్స్ ఏటీఎంలో నగదు విత్ర డ్రా చేసుకునే విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఎస్బీఐ ఖాతాదారులు ఇకపై క్యాష్ విత్ డ్రా చేసేటప్పుడు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 
 

1 /4

ఓటీపీ రూల్ ద్వారా ఇకపై ఓటీపి లేకుండా ఎవ్వరు పడితే వారు ట్రాన్సాక్షన్ చేయడానికి వీల్లేదు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

2 /4

బ్యాంక్ ఖాతా ఎవరి పేరుమీదైతే ఉంటుందో.. వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. రాత్రింబవళ్లు ఈ ఓటీపీ డెలివర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

3 /4

ఇకపై ఏటీఎంకు వెళ్లేటప్పుడు మీ డెబిట్ కార్డుతో పాటు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లండి.

4 /4

లేదంటే ఓటీపీ లేని కారణంగా క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోతుంది.