Shani Dev: 30 ఏళ్ల తర్వాత శని సంచారం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి డబుల్ జాక్పాట్.. ఊహించని డబ్బుతో పాటు లగ్జరీ లైఫ్..

Shani Dev luxury life: దాదాపు 30 సంవత్సరాల తరువాత శని గ్రహం కుంభ రాశి నుండి బయటకు వచ్చిస…మీన రాశిలోకి ప్రవేశించనుంది. ఇందువల్ల పలు రాశుల వారికి ఎంతో అదృష్టం రానుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు కోటీశ్వరులు కానన్నారు. మరి ఆ మూడు రాశుల్లో మీ రాసి కూడా ఉందో లేదో చూద్దాం..

1 /5

ఈ సంవత్సరం..హోలీ తరువాత శని గ్రహం దాదాపు 30 సంవత్సరాల తరువాత కుంభ రాశి నుండి బయటకు వచ్చి మీన రాశిలోకి ప్రవేశించనుంది. 2025 మార్చి 29న ఈ సంచారం జరుగుతుంది. శని ఈ రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండి, 12 రాశులపై ప్రభావాన్ని చూపనున్నాడు. అయితే, ఈ మార్పు ముఖ్యంగా మూడు రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది.

2 /5

మిథున రాశి వారికి ఈ శని సంచారం ఎంతో శుభకరం. శని మీ కర్మస్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో స్థిరత, పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.  

3 /5

ధనుస్సు రాశి వారికి ఈ శని సంచారం అనుకూలంగా ఉంటుంది. శని మీ ఇంట్లో స్థిరత్వాన్ని పెంచుతూ, కుటుంబంలో శుభకార్యాలకు కారణం అవుతాడు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  

4 /5

మకర రాశి వారికి ఈ సంచారం ఆర్థికంగా మంచిదే. ఆకస్మిక ధనలాభం, నిలిచిపోయిన సొమ్ము రికవరీ, వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా ఎదుగుదల, కుటుంబ సభ్యుల మద్దతు లభించనుంది.  

5 /5

ఇక్కడ చెప్పిన జ్యోతిష వివరాలు అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల మేరకు అందించబడ్డాయి. ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.