Shani Dosh Upay: కార్తీక మాసంలో శనివారంకు ఎంతో ప్రాధాన్యత ఉందంటారు. ఈరోజున కొంత మంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే, మరికొందరు ఆంజనేయస్వామిని పూజిస్తారు.
కార్తీక మాసంలో శనీవారంకు కూడా అత్యంత ప్రధాన్యత ఉందని చెబుతుంటారు. చాలా మంది శనీశ్వరుడు కష్టాలు పాలు చేస్తాడంటారు. కానీ అది పూర్తిగా తప్పు.
శనీశ్వరుడు మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. చెడు పనులు చేసతే అలాంటి ఫలితాలు కల్గుతాయి
శనీశ్వరుడికి కొన్ని పరిహారాలు చేస్తే కష్టాల నుంచి బైటపడొచ్చు. మెయిన్ గా శనీవారం రోజు శనీదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెబుతుంటారు. ఈరోజున ముఖ్యంగా శనీకి.. నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్లని వస్త్రం, నల్ల నువ్వులు వేయాలి.
నల్ల నువ్వులతో అన్నంను వండి ..ఆ అన్నాన్ని శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని.. కాకులకు, శునకాలకు ఆహారంగా పెడితే.. శనీశ్వరుడు పొంగిపొతాడంట. అలాంటి వారి జోలికి అస్సలు పొడంట..
అంతే కాకుండా.. శనీవారం రోజు ఇలా చేసే వారికి అఖండ సిరి సంపదలు, ధనధాన్యాలను కూడా వచ్చేలా శనీదేవుడు అనుగ్రహిస్తాడంట. అందుకే శనీవారం రోజున ఈ పరిహారం తప్పకుండా ఆచరించాలని పండితులు చెబుతున్నారు.
ఈరోజున రావి చెట్టు, మేడిచెట్టు దగ్గరకు వెళ్లి వాటి కింద ఉండే చీమలకు చక్కెర, బెల్లం, పాయసం వంటివి పెట్టాలి. ఇలా చేస్తే శనీశ్వరుడి ఆనంద పడతారంట.