Earth from the Space: భూమికి సంబంధించిన చాలా అందమైన ఫోటోల్ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ తన ఎక్కౌంట్‌లో షేర్ చేస్తోంది. ఈ ఫోటోలన్నీ స్పేస్ నుంచి తీసిన అందమైన ఫోటోలు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నగరాల వెలుగులు, మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాల మధ్య అంటూ క్యాప్షన్ పెట్టింది ఐఎస్ఎస్. నిజంగానే భూమి ఇంత అందంగా కన్పిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. దీపావళిలా మెరిసిపోతోంది భూమి ఈ ఫోటోల్లో.
సోషల్ మీడియాలో షేర్ చేసిన తరువాత ఈ పోటోల్ని జనం చాలా ఇష్టపడుతున్నారు. షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో భూమి ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. స్పేస్ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి ఇంకా నచ్చుతున్నాయి.
ఐఎస్ఎస్ తన అధికారిక ట్విట్టర్ అక్కౌంట్‌పై వెలుగుతో ప్రకాశిస్తున్న భూమికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. భూమధ్యరేఖ నుంచి 51.6 డిగ్రీల ఎగువ నుంచి ఈ ఫోటోలు తీశారు. ఈ ఫోటోల్లో భూమి చాలా అందంగా కన్పిస్తోంది. అంతరిక్షంలో మన భూమి వెలుగుతూ కన్పిస్తోంది.
అంతరిక్షపు ప్రపంచం చాలా నిర్మళంగా ఉంటుంది. స్పేస్‌సైన్స్ , దానికి సంబంధించిన రహస్యాల గురించి ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్..అంతరిక్షంలోని చాలా అందమైన ఫోటోల్ని తన ఎక్కౌంట్‌లో షేర్ చేస్తోంది. ఇటీవల ఆ సంస్థఖ స్పేస్ నుంచి భూమికి సంబంధించిన అందమైన ఫోటోల్ని షేర్ చేసింది. ఇవిప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి.