Mrunal Thakur: సీనియర్ హీరోతో మృణాల్ ఠాకూర్ ప్రేమయాణం.. ముహూర్తం ఫిక్స్!

Mrunal Thakur Career: మృణాల్ ఠాకూర్ హిందీ సినీ పరిశ్రమలో నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రత్యేకతను చూపించకుంది. వరుసగా రెండు విజయాలు అందుకున్న ఈ హీరోయిన్ కి మూడో సినిమా ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 

1 /5

మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. హిందీ సీరియల్స్ ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం..ఆ తర్వాత హిందీ చిత్రాల వైపు కొనసాగింది. సీతారామం చిత్రంతో తెలుగులో పెద్ద బ్రేక్ సాధించింది. ఇందులో సీత పాత్ర ద్వారా ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.  

2 /5

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం మనసా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఇప్పుడు బాలీవుడ్ లో ఈ హీరోయిన్ నటించిన ఒక భారీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఏ సినిమాలు ఏకంగా సీనియర్ హీరోతో.. కనిపించనుంది ఈ హీరోయిన్. అసలు విషయానికి వస్తే మృణాల్ కి అజయ్ దేవగన్ సరసన సన్నాఫ్ సర్దార్ సెకండ్ పార్ట్ లో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.  

3 /5

టాలీవుడ్ లో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ది ఫ్యామిలీ స్టార్ చిత్రం విజయవంతం కాకపోవడంతో కొంతకాలం.. మృణాల్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు డెకాయిట్ సినిమాలో అడివి శేష్ తో నటిస్తోంది.  

4 /5

ఈ క్రమంలో హిందీలో అజయ్ దేవగన్ సరసన ఈ హీరోయిన్ సినిమాకి ఒప్పుకుంది. 2012 లో అజయ్ దేవగన్ నటించిన "సన్నాఫ్ సర్దార్" సినిమాకు సీక్వెల్ రానున్న సినిమా సన్నాఫ్ సర్దార్ 2. ఈ చిత్రానికి కొత్త కథతో ఈ సీక్వెల్ రూపొందించబోతున్నారని వినికిడి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక మంచి ప్రేమ కథను పెట్టబోతున్నారంటూ.. ఆ ప్రేమ కథలో మృణాల్.. అజయ్ దేవగన్ తో ప్రేమాయణం.. నడపబోతోందంటూ తెలుస్తోంది. 

5 /5

ఈ సినిమా 2025 జూలైలో విడుదల కానుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏ సినిమా విడుదల తేదీ కన్ఫామ్ కావడంతో.. ఈ చిత్రం కోసం తెగ ఎదురుచూస్తున్నారు మృణాల్ అభిమానులు. హిందీలో ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో కూడా మృణాల్ తను నటనలో ప్రతిభ చాటుతూ పలు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఆమె కెరీర్ ను మరో మెట్టు పైకి తీసుకువెళ్ళే అవకాశం ఈ చిత్రాల ద్వారా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.