National Pension System Trust Recruitment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ఇదే మంచి టైమ్‌గా భావించవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్)పోస్టులో పాటు ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 05వ తేది వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ లోపే అప్లై చేసుకోవడం మంచిది. అర్హత కలిగిన వ్యక్తులు నేరుగా భర్తీ చేసుకోవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ దరఖాస్తు కోరిన మూడు విభాగాల్లో ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్లో ఫిల్ చేయబోతున్నారు. అయితే ఈ ఉద్యోగాల అర్హతలను కూడా నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్లో ఖాళీ వివరాలను పరిశీలించి చూస్తే.. ఇందులో అసిస్టెంట్ మేనేజర్‌కు సంబంధించిన ఉద్యోగాలు 13 ఖాళీ ఉంటే.. మేనేజర్ ఉద్యోగాలు 06 ఖాళీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లో విద్యార్హతలు కూడా వెల్లడించారు.
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల వివరాల్లోకి వెళితే.. ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు అభర్థ్యులుగా ప్రకటించారు. ఇక ఈ ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.44,500 నుంచి రూ. 99,750 వరకు చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలను అప్లై చేసుకునేవారికి నోటిఫికేషన్లో వయస్సు పరిమితిని కూడా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునేవారు 21 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షల ఉంటుంది.