Tabu controversy: నటి టబు ఇటీవల మగాళ్లపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. మగాడి అవసరం కేవలం బెడ్ మీదనే అంటూ ఆమె కామెంట్స్ చేశారని అనేక మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై తాజాగా, ఆమె టీమ్ రియాక్ట్ అయ్యారు.
సీనియర్ నటి టబు యాభై ఏళ్లు క్రాస్ చేసిన కూడా ఇప్పటికి కుర్ర కారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది. ఇప్పటికి ఆమె వన్నే తగ్గని అందం, గ్లామర్ తో యువతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
అయితే.. ఈ అమ్మడు గురించి తరచుగా ఏదో అంశం వార్తలలో ఉంటుంది. కొన్నిసార్లు ఆమె ఎఫైర్స్, పెళ్లి అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఇటీవల మాత్రం ఆమె మగాళ్లపై ఆమె కామెంట్లు చేశారనే వార్త మాత్రం సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై పెనుదుమారం చోటు చేసుకుంది.
టబు యాభై ఏళ్లు దాటిన.. ఇప్పటికి పెళ్లి చేసుకొకుండానే బ్రహ్మచారిణిగానే ఉన్నారు. అయితే.. టబు మగాళ్ల అవసరం బెడ్ వరకు మాత్రమే అని.. ఇంకా పెద్దగా లైఫ్ లో అవసరం ఉండని ఆమె అన్నారని అనేక సోషల్ మీడియాలు, మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీనిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఈ క్రమంలో దీనిపై టబు టీమ్ తాజాగా రియాక్ట్ అయ్యారు.
టబు పెళ్లిపై కానీ.. పెళ్లి తర్వాత భర్తల అవసరం అంటూ.. ఏవిధమైన కామెంట్లు చేయలేదని టబు టీమ్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా.. ఎలాంటి ఆధారాలు లేని అసభ్యకథనాలు ప్రచురించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని టీమ్ హెచ్చరించింది. చేయకూడని వ్యాఖ్యల్ని చేశారని.. ఎలా ప్రచురిస్తారని టీమ్ మండిపడింది.
ఇలాంటి నిరాధార కథనాల వల్ల.. ఎదుటి వారి పట్ల సమాజంలో తప్పుడు అభిప్రాయం కల్గుతుందని టీమ్ స్పష్టం చేసింది. వెంటనే బేషరతుగా.. ఈ కథనాలు ప్రచురించిన వారంతా సారీ చెప్పాలని కూడా టబు టీమ్ స్పష్టం చేసింది. ఇక మీదట ఇలాంటి వాటిని అస్సలు వదిలేది లేదని, పరువు నష్టందావా సైతం వేస్తామని టబు టీమ్ కుండ బద్దలు కొట్టినట్లు మరీ చెప్పింది.
టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో భూత్ బంగ్లా సినిమాతో బిజీగా ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ప్రియదర్శన్, అకయ్ కాంబోలో ఈమూవీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు.. 25 ఏళ్ల తర్వాత మళ్లీ టబు, అక్షయ్ లు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరు చివరగా.. హేరా ఫెరీలో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 2 విడుదల కానుందని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.