Vinfast Micro Suv Car In India: భారత్‌లో ఘనంగా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జరుగుతోంది. ఈ ఎక్సోపోలో భాంగా అన్ని రకాల ఆటో మొబైల్ కంపెనీ కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే కొన్ని కొత్త కంపెనీలకు సంబంధించిన కార్లు విడుదలయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్లోకి అద్భుతమైన కారును లాంచ్ చేయబోతోంది. ఇది VF3 మినీ SUV పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు అదిరిపోయే లుక్‌తో విడుదల కాబోతోంది.
విన్‌ఫాస్ట్ కంపెనీ తమిళనాడులోని ప్రరిశ్రమను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అద్భుతమైన మైక్రో SUV కారును విడుదల చేయనుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వేరియంట్‌తో లాంచ్ అయినట్లు కంపెనీ తెలిపింది.
ఈ మైక్రో SUV అద్భుతమైన బ్యాటరీతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని వీల్‌బేస్ కేవలం 3190 మి.మీ పొడవు నుంచి 2075 మి.మీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని ఇంజన్ 43.5 హార్స్‌పవర్‌తో పాటు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక దీని బ్యాటరీ 18.64 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు సుమారు 210 కిలోమీటర్ల పరిధి వరకు మైలేజీని కూడా అందిస్తుంది. అలాగే దీని వెనక భాగంలో బూట్ స్పేస్ ఆప్షన్ కూడా లభిస్తోంది.
అంతేకాకుండా ఈ Vinfast మైక్రో SUV కారు కంట్రోల్స్ కోసం ప్రత్యేకమైన పెద్ద టచ్‌స్క్రీన్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రాంట్ భాగంలో ప్రత్యేకమైన సీటింగ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది.