Shirdi Sai Baba Temple to reopen today: న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా 7 నెలలపాటు మూతబడి ఉన్న షిర్డీ సాయిబాబా మందిరం సోమవారం తెరుచుకుంది. దీంతో సుధీర్ఘకాలం తరువాత షిర్డీ సాయి నాధుడిని భక్తులు దర్శంచుకుంటున్నారు. భక్తులు మందిరానికి వస్తుండటంతో మందిర ప్రాంతంలో కోలాహలం నెలకొంది.
అయితే కోవిడ్ నిబంధనలతో భక్తులను మందిరంలోకి అనుమతిస్తున్నారు. ముందుగా బాబా దర్శనం కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికే అనుమతిస్తున్నారు. దీంతోపాటు భక్తులు కోవిడ్19 నెగిటివ్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను ఆలయంలోకి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.
కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్రంలో మతపరమైన స్థలాలను తిరిగి తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.