Railway Interesting Facts: మనం సాధారణంగా కారు, బస్సు, బైక్ ఇతర వాహనాలను లిఫ్ట్ అడుగుతుంటాం. కానీ ఈ ట్రైన్‌ను లిఫ్ట్ అడగొచ్చని తెలుసా..! మనం చేయి ఎత్తితే ట్రైన్ ఆగుతుందా.. అంటే అన్ని ట్రైన్స్ ఆగవు. కానీ ఒక ట్రైన్ మాత్రం ఆగుతుంది. ఇది కేవలం 3 కోచ్‌లతో నడుస్తున్న అతి చిన్న రైలు. బ్రిటీష్ కాలం నాటి నుంచి నడుస్తున్న ఈ ట్రైన్.. ఇప్పటికీ కూడా సేవలు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
మన దేశంలో నిత్యం కోట్లాది మందిని వేలాది రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీటిలో అతి చిన్న రైలు కూడా ఒకటి ఉంది. కొంచ్ నగర్ నుంచి జలౌన్‌లోని సర్సౌకి స్టేషన్ వరకు సేవలు అందిస్తున్న ఈ రైలు పేరు ఐత్ కొంచ్ షటిల్.
మొదట్లో కేవలం 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. నష్టాల కారణంగా నిలిపేశారు. ఈ రైలు మళ్లీ ప్రారంభించాలని ప్రజల డిమాండ్ చేయడంతో కొంచ్ నగర్ నుంచి జలౌన్‌లోని సర్సౌకి స్టేషన్ వరకు ప్రారంభించారు.
మొదట్లో కేవలం 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. నష్టాల కారణంగా నిలిపేశారు. ఈ రైలు మళ్లీ ప్రారంభించాలని ప్రజల డిమాండ్ చేయడంతో కొంచ్ నగర్ నుంచి జలౌన్‌లోని సర్సౌకి స్టేషన్ వరకు ప్రారంభించారు.
ఇంజిన్‌తో పాటు కేవలం 3 కోచ్‌లు మాత్రమే ఉంటాయి. గంటకు కేవలం 30 కి.మీ వేగంతో వెళుతుంది. 13 కి.మీ దూరాన్ని 35 నిమిషాల్లో చేరుకుంటుంది. ఎవరైనా ట్రైన్ మిస్ అయ్యే సమయంలో చేయి ఎత్తినా ఆగుతుంది.
కొంచ్ నుంచి సర్సౌకి వరకు రోజుకు రెండుసార్లు సేవలు అందిస్తోంది. స్టేషన్ దగ్గర మాత్రమే కాకుండా.. ప్రయాణికులు మధ్యలో ఎక్కడైనా చేయి ఎత్తి ట్రైన్‌లో ఎక్కిపోవచ్చు.
రైతులు, విద్యార్థులు, ఉపాధి కార్మికులు, చిన్న చిన్న వ్యాపారులకు ఈ రైలు చాలా ఉపయోగపడుతోంది. ఈ ట్రైన్‌లో టికెట్ ధరలు కేవలం రూ.10, రూ.15 మాత్రమే ఉన్నాయి.