Sreeleela Movies: పెల్లి సందD చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ లీల. ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆమె ఒక పెద్ద త్యాగం చేసింది అనే వార్త తెగ వినిపిస్తోంది. అంతేకాదు ఆమె నిర్ణయం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ నిర్ణయం ఏమిటో ఒకసారి చూద్దాం..
టాలీవుడ్లో పెల్లి సందD సినిమాతో అడుగుపెట్టిన శ్రీ లీల కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, వరుసగా వచ్చిన కొన్ని ఫ్లాపుల కారణంగా ఆమె కెరీర్ తెలుగులో కొంచెం మందగించింది.
అయితే అల్లు అర్జున్ పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత ఆమెకు తిరిగి మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమె ఒక్కో సినిమాకు ₹3 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె చేతిలో ఏకంగా నాలుగైదు, తెలుగు సినిమా ఆఫర్లు ఉన్నాయి.
మరోపక్క శ్రీ లీల బాలీవుడ్లో తన తొలి సినిమా సైన్ చేసింది. కానీ ఈ ప్రాజెక్టు కోసం ఈమె పెద్ద త్యాగమే చేసింది. అదేమిటి అంటే..ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఈ హీరోయిన్ కేవలం ₹1.75 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి..తక్కువ రెమ్యూనరేషన్‌కి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మరో దక్షిణాది నటి రష్మిక మందన్న బాలీవుడ్ చిత్రం ఛావా కోసం ₹4 కోట్లు పారితోషికం పొందుతున్నట్లు సమాచారం. ఇది ఆమె దక్షిణాది సినిమాల్లో అందుకునే రెమ్యూనరేషన్‌తో సమానంగా ఉందని చెబుతున్నారు. మరి శ్రీ లీల కూడా ఫ్యూచర్లో హిందీలో స్టార్ స్టేటస్ అందుకని.. తెలుగులో తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా లేదా చూడాలి.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో శ్రీ లీలా నటిస్తున్న చిత్రం ఆషికి 3. ఘన విజయాలను సాధించిన ఆషీకీ, ఆషీకీ 2 సినిమాలకు ఈ సినిమా మరో భాగంగా రానుంది. ఈ చిత్రం తర్వాత ఆమె సైఫ్ అలీ ఖాన్ కుమారుడితో కూడా ఒక సినిమా చేయనుంది.