tar Heroine Ill Legal Affairs: ఒకప్పుడు ఈ కథానాయిక భారతీయ సినీ పరిశ్రమను తన నటనతో మెప్పించింది. అంతేకాదు పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు. అంతేకాదు పెళ్లి కానీ నటికి బిడ్డగా పుట్టడం.. తండ్రున్నా.. ఆయన లవ్ కు దూరమవడం.. ఇలా పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసింది. కానీ సినీ రంగంలో మాత్రం నెంబర్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు తన వ్యక్తిగత జీవితంలో ఎంతో మంది హీరోలతో ఎఫైర్స్ నడిపించింది. ప్రస్తుతం ఈమె వయసు 70 యేళ్లు. ఈ వయసులో ఒంటరిగా తన లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తోంది.
Star Heroine Ill Legal Affairs:ఒకప్పుడు ఆమె హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తే చాలు అప్పటి కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు. విజిల్స్ వేసేవారు. ఆమె అందానికి సాహో అంటూ గులాములు అయ్యారు ఎంతో మంది. ఆమె బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటెన్ చేయడం అది రేఖకు మాత్రమే సాధ్యమైంది.
రేఖ రియల్ లైఫ్.. ఫేమస్ డైరెక్టర్ కే.బాలచందర్ తెరకెక్కించిన 'అంతులేని కథ' తరహాలో ఉంటుంది. స్టార్ హీరో కూతురు అయినా.. ఎన్నో వివక్షలను ఎదుర్కొంది. గోల్డ్ స్పూన్ బేబి అయినా అవకాశాల కోసం ఎన్నో కష్ట నష్టాలను భరించింది. సినీ బ్యాక్ గ్రౌండ్ (తమిళ స్టార్ హీరో జెమిని గణేషణ్ కూతరు) ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. ఈ రేంజ్ కష్టాలు అనుభవించిన హీరోయిన్ ఎవరు ఉండరేమో.
తన చిత్రాలతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. మరోవైపు రేఖ పర్సనల్ లైఫ్ ఎంతో వివాదాస్పదం అనే చెప్పాలి. ఈమె జీవితంలో ఒక సినిమాకు మించిన ట్విస్టులున్నాయి.
రేఖ పేరుతో ముడిపడి ఉన్న ఫస్ట్ హీరో అమితాబ్ బచ్చన్ అని అందరు ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ రేఖ జీవితం ముందుగా అప్పటి అగ్ర హీరో జితేంద్రతో మొదటైంది. ఆ హీరోతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అప్పటికే జితేంద్ర పెళ్లి కావడంతో ఈ బంధానికి గుడ్ బై చెప్పేసింది రేఖ.
ఆ తర్వాత బాలీవుడ్‌లో విలన్‌గా రాణిస్తోన్న కిరణ్ కుమార్ అనే ప్రముఖ నటుడితో తన లవ్ ఎఫైర్ కొనసాగించింది. ఈయన తేజాబ్, ఖుదాగవా వంటి పలు చిత్రాల్లో మెయిన్ విలన్‌గా నటించారు.
ఆపై రేఖ ప్రముఖ హీరో వినోద్ మెహ్రాతో సహ జీవనం చేసింది. ఆయన్ని రేఖ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందనే వార్తలు కూడా అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఆ వార్త అబద్దం అంటూ ఓ ఇంటర్వ్యూలో రేఖ చెప్పింది.
అక అమితాబ్ తో రేఖ అనుబంధం మొత్తం సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. 'దో అంజానే' సినిమాలో వీళ్లిద్దరు తొలిసారి కలిసి యాక్ట్ చేశారు. అప్పటికే బిగ్ బీకి మ్యారేజ్ అయినా.. ఎలాంటి మొహమాటం లేకుండా తన లవ్ ను ఎక్స్ ప్రెస్ చేసింది. అప్పట్లో అమితాబ్, రేఖలు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత బిగ్ బీ భార్య జయ బచ్చన్ జోక్యం చేసుకోవడంతో రేఖతో అమితాబ్ ప్రేమా ప్రయాణానికి పులిస్టాప్ పడేలా చేసింది. అంతేకాదు రేఖతో కలిసి పనిచేయకుండా అమితాబ్‌కు ముందరి కాళ్లకు బంధాలు వేసింది.
అప్పట్లో అమితాబ్ బచ్చన్, రేఖ, జయా బచ్చన్ కలిసి యాక్ట్ చేసిన 'సిల్‌సిలా' చిత్రం పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. అంతేకాదు అమితాబ్, రేఖ ఎఫైర్ కోసమే యశ్ చోప్రా ఈ సినిమాను తీసినట్టు అప్పట్లో అందరు నోటా ఈ సినిమా గురించే చర్చ జరిగింది.
కథానాయకులతో ఎఫైర్స్ తర్వాత ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారి ముఖేష్ అగర్వాల్‌ను రేఖ మ్యారేజ్ చేసుకుంది. అతనితో రేఖ పర్సనల్ లైఫ్ సాఫీగా సాగలేదనే విషయాన్ని 'రేఖ.. అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తకంలో పేర్కొంది.
ఇక చివరగా ఈమె ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఎఫైర్ నడిపించిందనే వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరు 'జమీన్ ఆస్మాన్' సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదనే విషయాన్ని వాళ్లిద్దరు ఖండించినా ఈ ఎఫైర్ వార్త అప్పట్లో పత్రికలకు మంచి మ్యాటర్ ను అందజేశాయి.
మొత్తంగా రేఖ జీవితంలో ఓ సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. అది బయోపిక్ తీస్తే ఓ సినిమాకు కావాల్సినంత వినోదం గ్యారంటీ అనే చెప్పాలి.