summer Home Cooling Tips: ఈ మండు వేసవిలో ఏసీ తో పనిలేకుండా ఇంటిని చల్లబరచడానికి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అందరి ఇళ్లలో ఏసీలు లేదా కూలర్లు విపరీతంగా వినియోగిస్తున్నారు.
summer Home Cooling Tips: ఈ మండు వేసవిలో ఏసీ తో పనిలేకుండా ఇంటిని చల్లబరచడానికి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అందరి ఇళ్లలో ఏసీలు లేదా కూలర్లు విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని ఇలా నిరంతరం వినియోగించడం వల్ల అవి త్వరగా పాడవడం జరుగుతోంది అదే సమయంలో అతిగా వినియోగించడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు.ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులను నిరంతరం వాడటం వల్ల కరెంట్ వినియోగం కూడా పెరుగుతోంది. కాబట్టి ఇంటిని చల్లబరుచుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. కొన్ని అలాంటివి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
ఇండోర్ ప్లాంట్స్.. ఎండకాలం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవటం వల్ల గదిలోని గాలి సహజసిద్ధంగా కూల్ అవుతుంది. అదే సమయంలో వేడి తీవ్రత తగ్గుతుంది. సహజ సిద్ధంగా గాలి లభించేందుకు ఉపయోగపడే అలోవీరా, స్నేక్ ప్లాంట్ లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గాలిలోని టాక్సిన్స్ నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు.
ఐస్ క్యూబ్స్ .. ఎండకాలం మీ గది మొత్తం చల్లగా గాలిని ఆస్వాదించడానికి చేయవలసిందల్లా ఐస్ క్యూబ్స్ టెక్నిక్. దీంతో మీ గది మొత్తం చల్లగా మారిపోతుంది. ఒక పాత్రలోకి ఐస్‌క్యూబ్స్ తీసుకుని టేబుల్ ఫ్యాన్ ముందు పెట్టండి. ఇది మీ ఇంటిని చల్లగా ఉండేలా చేసి వేడి నుంచి ఉపశమనాన్ని అందించేందుకు తోడ్పడుతుంది.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ .. ఎండవేడిమిలో బాత్రూం లేదా కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాసేపు ఆన్ చేసి ఉంచండి. దీనివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. వంట వల్ల వేడెక్కిన ప్రదేశాలను ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ఈ ప్రయోజనాలను వేసవి వేడి నుండి రక్షణ కోసం కూడా వినియోగించండి. అంతేకాదు రాత్రిపూట ఉష్ణోగ్రతలో తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే తాజా గాలిని లోనికి ఆహ్వానించడానికి రాత్రిపూట కిటికీలు తెరవండి.
బ్లాక్‌అవుట్ కర్టెన్స్.. ఇంట్లోకి ప్రవేశించే వేడి ఈ బ్లాక్ అవుట్ కర్టెన్స్ వినియోగించడం వల్ల దాదాపు 24 శాతం తగ్గే అవకాశం ఉంది. వీటని కిటికీలకు వేయడం వల్ల ఎండాకాలంలో గదులను చల్లగా ఉంచుతాయి .అదేవిధంగా చలికాలంలో గదులలో వెచ్చదనాన్ని నిలిపి ఉంచుతాయి. దీనివల్ల ఏసీ అలాగే కులార్ల వినియోగం కూడా కాస్తంత తగ్గొచ్చు. ఈ కర్టెన్స్ లోపలికి వేడిని రాకుండా చేస్తాయి.
ఫ్యాన్.. ఎండకాలం ఇంటిని చల్లబరిచే చిట్కాలో ఇది ఒక సారి ట్రై చేసి చూడండి. మీ ఇంటి ఫ్యాన్ దిశ కౌంటర్ డైరెక్షన్ లో తిరిగేలా చూడండి. ఈ విషయం మీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ, ఫ్యాన్ కౌంటర్ డైరెక్షన్‌లో ఏర్పాటు చేసుకుంటే వేడిగాలి తగ్గడాన్ని మీరు గమనిస్తారు. వేసవిలో దీని డైరెక్షన్ మార్చుకోవడం వల్ల తప్పకుండా వేసవి వేడి నంఉచి ఉపశమనం కలుగుతుంది ఓసారి ట్రై చేయండి.