Maruti Suzuki Jimny Conqueror Price: ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ వెర్షన్ కార్లకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చిన థార్‌తో పాటు జిమ్నీలను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతైతే వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కొత్త రకం ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ జిమ్నీను పరిచయం చేసింది.
ఈ కొత్త రకం జిమ్నీ కాంకరర్ (Maruti Suzuki Jimny Conqueror) అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బాడీతో రాబోతోంది. అలాగే జిమ్నీ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండనుంది. అయితే ఈ ఆఫ్‌రోడ్ కారుకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం..
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో పరిచయం చేసిన మారుతి సుజుకి జిమ్నీ కాంకరర్ (Maruti Suzuki Jimny Conqueror) గత మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆఫ్‌రోడ్ చేసేవారికి ఈ కొత్త కారులో ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆఫ్‌రోడ్ కారు బ్లాక్ కలర్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా దీని ఫ్రంట్ భాగంలో ఫ్రంట్ ఫాసియా ఐకానిక్ సుజుకి గ్రిల్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన రౌండ్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ కారుకు కంపెనీ ఫాగ్ కంట్రోల్ లాంప్స్ కూడా అందిస్తోంది.
ఇక ఈ కారు బ్యాక్ సెటప్‌లో ప్రత్యేకంగా చేసిన మౌంట్ చేసిన స్పేర్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ కారు ఎంతో శక్తివంతమైనతమైన 1.5L 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఈ కారుకు సంబంధించిన విడుదల తేదిని ఇంకా ప్రకటించలేదు. అయితే దీనిని అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మారుతి సుజుకి జిమ్నీ కాంకరర్ మార్కెట్‌లోకి విడుదలైతే.. మహీంద్రా ఇటీవలే విడుదల చేసిన థార్ రోక్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీని డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మారుతి సుజుకి కంపెనీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఏడాదిలో వెళ్లడించే ఛాన్స్ ఉంది.