Tata Avinya: టాటా నుంచి నెక్ట్‌ లెవల్ కారు.. ఇది లాంచ్‌ అయితే Audi, Bmw కంపెనీ కార్లకు బైబై.. ఫీచర్స్‌, ఫోటోస్‌ ఇవే..

Tata Avinya Price In India: త్వరలోనే భారత మార్కెట్‌లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌ కాబోతోంది. ఇది టాటా అవిన్య X పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Tata Avinya Launch Date In India: భారత మార్కెట్లో టాటా రోజురోజుకు అంచెలంచెలుగా ఎదుగుతోంది. అద్భుతమైన సెఫ్టీ కార్లను విడుదల చేస్తూ చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా తాజాగా విడుదల ఇటీవలే విడుదలైన కార్లు అద్భుతమైన డిమాండ్‌తో సేల్‌ అవుతున్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకునే.. ఇటీవలే చాలా కంపెనీలు కొత్త కొత్త కార్లను విడుదల చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో జరుగుతోంది. అయితే ఇందులో భాగంగానే టాటా మరో కొత్త కారును పరిచయం చేసింది.

1 /5

టాటా కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వెళ్తొంది. ఈ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో భాగంగానే టాటా అవిన్య X కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ఈ కారు అద్భుతమైన డిజైన్‌తో ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

2 /5

ఈ టాటా అవిన్య X కాన్సెప్ట్‌ ఆటో ఎక్స్‌పోలో అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ కారు ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ టెయిల్ లైట్లతో విడుదల కావడంతో చాలా మంది దీని విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు మార్కెట్‌లో లాంచ్‌ అయితే లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీ పడే ఛాన్స్‌ కూడా ఉన్నట్లు సమాచారం.    

3 /5

టాటా మోటార్స్ లగ్జరీ EV AVINYA కారును తక్కువ ధరలోనే విక్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారులో స్పెషల్‌ డోర్స్‌ స్టిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకమైన హై స్టాన్స్, భారీ చక్రాలు ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. ఈ కారు ప్రత్యేకమైన మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి.  

4 /5

ఈ అవిన్య X కారు ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన ట్రిపుల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా లభిస్తోంది. దీంతో పాటు స్పెషల్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందుబాటులో ఉంది.   

5 /5

ఈ కారు స్పెషల్ లెవెల్-2 ADAS పంక్షన్‌ సెటప్‌తో విడుదల కాబోతోంది. అలాగే ఇది మార్కెట్‌లో విడుదలైతే.. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో పోటీ పడే ఛాన్స్‌ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 500 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. అయితే దీనిని టాటా కంపెనీ 2026 సంవత్సరం చివరి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.