Swapna Shastra: మనకు నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తుంటాయి. కొందరికి వెరైటీగా డ్రీమ్స్ వస్తుంటాయి. కలలో పెళ్లయినట్లు, జర్నీచేస్తున్నట్లు కొందరికి వస్తే, మరికొందరుకి ఏవేవోప్రమాదాలు జరిగినట్లు కూడా వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు పడే కలలవెనుకాల ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.
మనకు నిత్య జీవితంలో కలల ప్రభావం కూడా ఎంతో ఉంటుందని పండితులు చెబుతుంటారు. నిద్రలో పడే కలలను బట్టి మనిషి జీవితంలో పాజిటిట్ లేదా నెగేటివ్ ప్రభావాలు కల్గుతుంటాయని పండితులు చెబుతుంటారు. కొందరికి కలలో పెళ్లి జరిగినట్లు కలలు పడుతుంటాయి. అయితే.. ఇలాంటి కలల వల్ల చెడుఫలితాలు కల్గుతాయని చెబుతారు.
కొందరికి కలలో పాములు కూడా కన్పిస్తుంటాయి. పాములు కన్పించడం అనేరి రాహు,కేతు దోషాలను సూచిస్తుందని చెబుతారు. అందుకే ఈ దోషాలున్న వారు వెంటనే దోష పరిహారాలను చేసుకుంటే మంచి జరుగుతుంది. అంతేకాకుండా కొందరికి కలలో పాములు కాటు వేసినట్లు కూడా కన్పిస్తుంది.
ఇక కలలో ఏనుగు లేదా గుర్రం కన్పిస్తే రాజయోగానికి అవకాశం ఉందని చెబుతుంటారు. అంటే వచ్చే కాలంమంతా ఎంతో కలిసి వస్తుందని ఏపనిచేసిన కూడా సక్సెస్ అవుతుందని చెబుతుంటారు. మన జీవితంలోని విఘ్నాలు అన్ని కూడా దూరమైపోతాయని కూడా చెబుతుంటారు. బిజినెస్ లు, రియల్ ఎస్టెట్ రంగంలో రాణించే అవకాశం ఉందని చెబుతుంటారు.
కలలో కనుక ఏదైన ప్రమాదాలు జరిగినట్లు లేదా రక్తం , రోడ్డుప్రమాదంలో చనిపోయినట్లు కల పడితే ఆవ్యక్తి లైఫ్ లో రానున్న రిస్క్ నుంచి బైటపడ్డట్లు అని చెబుతారు. అంటే ఆ వ్యక్తికి వచ్చిన పెద్ద ప్రమాదం తప్పిపోయిందని చెప్తారు. వాహానం నుంచి కింద పడినట్లు వస్తే, చేస్తున్న ఉద్యోగంలో ఏదైన ఆటంకం కలిగే ఇబ్బందులు ఉన్నాయని చెబుతారు.
ఒకవేళ కలలో కనుక చెట్లు నాటుతున్నట్లు, చెట్ల కింద ఉన్నట్లు కనపడితే.. మంచియోగం మనల్ని వెతుక్కుంటు వస్తుందని చెబుతుంటారు. అందుకే దీనికి తగ్గట్టుగా.. రాశి ఫలాలను బట్టి చెట్లను నాటడం వంటి పనులను చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కల్గుతుందని చెబుతుంటారు.
ఇక కలలో ఎవరైన మలంలో పడినట్లు లేదా బాత్రూంలో మలం చూసిన కూడా వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెబుతుంటారు. అదే విధంగా వీరికి అనుకోని విధంగా డబ్బులు వీరి సొంతమౌతుంది. బంగారం, డబ్బులు వీరికి ఏదో ఒకరకంగా లాభాలు వస్తాయని చెబుతారు. ఆకస్మిక ధనలాభం వస్తుందని కూడా చెబుతుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)