Tata Nano EV 2025 Model: రూ.2 లక్షలకే టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో నాన్ స్టాప్‌ 400 కీలో మీటర్స్‌..

Tata Nano Electric Car 2025 Model: త్వరలోనే టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది అలాగే 400 కీలో మీటర్లుతో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌, ధర వివరాలు తెలుసుకోండి. 
 

Tata Nano Electric Car 2025 Model: టాటా మోటార్స్ కార్లు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. హై సెఫ్టీ ఫీచర్స్‌తో విడుదలయ్యే ఈ కార్లునే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే టాటా కంపెనీ కూడా దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం ఫీచర్స్‌తోనే అతి తక్కువ తధరలో విడుదల చేస్తూ వస్తోంది. అయితే టాటా మోటర్స్‌ మరో ముందడుగు వేసింది. అద్భుతమైన ఫీచర్స్‌తో రాతన్‌ టాటా డ్రీమ్‌ కారు నానో ఈవీని త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. 

1 /6

గతంలో టాటా నానో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం రూ.1 లక్షలోనే లాంచ్‌ కావడంతో మిడిల్‌ క్లాస్‌ వినియోగదారులు కూడా ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఇదే కారు EVలో విడుదల చేసేందుకు సిద్ధమైంది.    

2 /6

టాటా కంపెనీ భారత్‌లో ప్రతి కుటుంబ సొంత కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ కారును అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అతి తొందరలోనే కారు కొనుగోలు చేయాలనే ప్రతి ఒక్కరి కోరిక ఈ టాటా నానో EV కారుతో నెరవేరబోతోంది.   

3 /6

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాటా నానో కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ఫోటోస్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇది ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే మార్కెట్‌లో పెద్ద టాక్‌.. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.     

4 /6

ఈ నానో ఈవీ  17 kWh బ్యాటరీ ప్యాక్‌తో విడుదల కాబోతోంది. అలాగే ఇది ఛార్జ్‌ చేస్తే దాదాపు 400 కీలో మీటర్లుకు పైగా మైలేజీని అందించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది.    

5 /6

ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి.. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం భద్రతా ఫీచర్స్‌తో లాంచ్‌ కానుంది. అలాగే అద్భుతమైన కలర్‌ ఆప్షన్‌తో విడుదల కాబోతోంది.     

6 /6

ఇక ఈ కారుకు సంబంధించిన ధర చూస్తే.. దీనిని టాటా కంపెనీ  ధర రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలోపే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది.