Telangana Weather Update: రాష్ట్ర ప్రజలకు వాతావరణ హెచ్చరిక.. రాగల మూడు రోజుల్లో..!

Telangana Weather Forecast: వాతావరణంలో పలుమార్పులను ముందుగానే పసిగట్టే వాతావరణ శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

1 /5

ప్రస్తుత కాలంలో.. కాలంతో సంబంధం లేకుండా ఎడతెరపని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల వరకు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికం కాబోతున్నాయని మరొకసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఉదయం నమోదు చేసిన ఫలితాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అల్పపీడన ప్రాంతం ఒకటి ఈరోజు అనగా డిసెంబర్ 17 ఉదయం 8:30 సమయంలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందట. 

2 /5

దీని అనుబంధ చక్రపాత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రాంతం రాగల రెండు రోజుల్లో మరింత బలపడి, పశ్చిమ, వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

3 /5

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుండి వీచుతున్న నేపథ్యంలో వర్షాలు పడే అవకాశం ఉందట. ముఖ్యంగా ఈరోజు , రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

4 /5

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల్లో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వచ్చే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. 

5 /5

ఈ శీతల గాలులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది .ముఖ్యంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదు అని కూడా తెలిపింది.