Daaku Maharaaj: బాలకృష్ణ రీసెంట్ సూపర్ హిట్ సినిమా వదులుకున్న స్టార్ హీరో…!

Telugu Star Hero Missed Daaku Maharaj Movie: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ డాకూ మహారాజ్..బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అదనంగా షోలు వేస్తున్నారంటే ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.  

1 /5

సంక్రాంతికి విడుదలైన డాకూ మహారాజ్.. సినిమా ద్వారా బాలయ్య వరుస హిట్లను.. కొనసాగిస్తూ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. "అఖండ", "వీరసింహారెడ్డి", "భగవంత్ కేసరి" వంటి విజయాలతో పాటు ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. మొదటి మూడు రోజుల్లోనే రూ. 92 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ. 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది.    

2 /5

వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట రవితేజ కోసం ప్లాన్ చేశారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన "పవర్" సినిమా తర్వాత రవితేజకు "డాకూ మహారాజ్" కథ చెప్పగా, ఆయన ఆసక్తి చూపించలేదట. "కిక్ 2" సినిమా సరైన ఫలితం ఇవ్వకపోవడంతో అలాంటి కథను మళ్లీ ప్రయత్నించడం సరికాదని భావించారు అని వినికిడి. రవితేజ ఈ అవకాశాన్ని వదులుకోవడం వల్ల బాలయ్యకు ఈ హిట్ దక్కింది.    

3 /5

బాబీ దర్శకత్వ ప్రతిభ.. ఈ సినిమాలో ప్రతిఫలించింది. బాలయ్యను స్టైలిష్‌గా చూపిస్తూ, మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కథను రవితేజకు కంటే బాలయ్యకు మరింత సరిగ్గా సరిపోతుందని.. బాబీ నిరూపించారు.  

4 /5

రవితేజ ఇప్పుడు వరుసగా ప్లాప్‌లతో తన కెరీర్‌లో డౌన్ ఫేస్ ఎదుర్కొంటున్నారు. "డాకూ మహారాజ్" వంటి చిత్రం చేసినట్లయితే, ఆయన కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథలను వదులుకోవడం రవితేజకు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

5 /5

ఇక "డాకూ మహారాజ్" సినిమా ద్వారా బాలకృష్ణ తన విజయ పరంపరను కొనసాగించారు. స్టైలిష్ లుక్, పవర్‌పుల్ యాక్షన్, బాబీ దర్శకత్వం ఈ సినిమాను ఒక మెమొరబుల్ హిట్‌గా నిలిపాయి. టాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. మరోసారి బాలయ్యను బాక్స్ ఆఫీస్ కింగ్‌గా నిరూపించింది.