Thandel 1st Day Box Office collection: ‘తండేల్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..

Thandel 1st Day Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా టైటిల్ రోల్లో నటించిన మూవీ  ‘తండేల్’. సాయి పల్లవి కథానాయికగా యాక్ట్ చేసింది. చందూ మొండేటి డైరెక్ట్ చేసారు. అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ నిర్మించిన  ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో విడుదలైంది. గత కొన్నేళ్లు చైతూ నటించిన ఏ మూవీకి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రాలేదు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..

 

1 /5

Thandel 1st Day Box Office collection: నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’.  పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా  చైతూ కెరీర్ లో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ డే అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

2 /5

ప్రేమమ్, సవ్యసాచి చిత్రాల తర్వాత నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో  నాగ చైతన్య ‘తండేల్ రాజు’ పాత్రలో ఒదిగిపోయాడు. తన కెరీర్ లో ఈ సినిమాలో నటించినంతగా మరే సినిమాలో యాక్ట్ చేయలేదనే పేరు తెచ్చుకున్నాడు.  లవ్ కమ్ యాక్షన్, ఎమోషన్ తో కూడి దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. 

3 /5

టీజర్, ట్రైలర్ తర్వాత ‘తండేల్’ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో నెలకున్నాయి. ‘లవ్ స్టోరీ’ తర్వాత చైతూ, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. అది కలెక్షన్ల రూపంలో కనిపించింది.

4 /5

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 9 కోట్ల షేర్ (13 కోట్ల గ్రాస్) సాధించింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 14 కోట్ల షేర్ (రూ. 21.27 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.  అంతేకాదు తొలి రోజే దాదాపు 35 శాతం రికవరీ సొంతం చేసుకుంది.

5 /5

ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం స్పెషల్ ఎస్సెట్ గా నిలిచింది.  మొత్తంగా రూ. 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రంగంలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 22 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.