5 Super Foods: మారుతున్న సీజన్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు అనేక ప్రయోజనాలు..

5 Super Foods: వాతావరణంలో మార్పులు అనేక వ్యాధులకు దారితీస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు త్వరగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. వీరు త్వరగా కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది. అయితే, కొన్ని ఉత్తమ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
 

1 /6

ఈ మారుతున్న సీజన్లో ఆరోగ్య సమస్యలతోపాటు చర్మసమస్యలు కూడా వస్తాయి. చర్మం మాయిశ్చర్ కోల్పోతుంది. అందుకే విటమిన్స్, మినరల్స్ ఉండే సూపర్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోవడం మంచిది.  

2 /6

చేపలు.. చేపల్లో ఓమేగా ఫ్యాటీ 3 పుష్కలంగా ఉంటుంది. నాన్ వెజ్ ఆహారపదార్థాల్లో చేప ఉత్తమ ఎంపిక. ఇందులో ఉండే పోషకాలు చర్మం, జుట్టుకు మేలు చేస్తుది. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ చేపలు మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ సూపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే, తక్కువ మొత్తం నూనెను వినియోగించి వండిన చేపలను తీసుకోవడం మంచిది.

3 /6

అవకాడో.. అవకాడో కూడా బెస్ట్‌ సూపర్ ఫుడ్. ఇందులో కూడా ఒమేగా3 ఫ్యాటీ యాసిడస్‌, విటమిన్ సీ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  చర్మం కూడా పొడిబారకుండా అవకాడో కాపాడుతుంది.  

4 /6

గింజలు.. వీటిలో కూడా విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోజూ కొన్ని వాల్‌నట్స్ లేదా సన్ ఫ్లవర్ సీడ్స్ మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ఇది చర్మ కణాలను కూడా రిపెయిర్ చేస్తుంది. అంతేకాదు కొత్తకణాలను ఏర్పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

5 /6

పాలకూర.. ముఖ్యంగా సీజన్ మారుతున్నప్పుడు సూపర్ ఫుడ్స్ కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ ఇక ఖనిజాలు ఉంటాయి. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తుంది.

6 /6

చిలగడదుంప.. ప్రస్తుతం మార్కెట్లో ఈ చిలగడదుంపలు అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా సూపర్ ఫుడ్స్. ముఖ్యంగా ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉడికించుకుని లేదా కాల్చి తింటారు. చిలగడదుంప శరీరంలో తక్షణ శక్తినిస్తాయి.