crazy facts about animals: అడవుల్లో ఉండే జంతువులు భిన్నమైన జీవన విధానంను కల్గి ఉంటాయి. అవి తినే ఆహారం, వాటి పనులు వల్ల జంతువులు కొన్ని సార్లు వార్తలలో ఉంటాయి. కొన్ని రకాల జంతువులు నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా నెలల తరబడి అలాగే ఉంటాయి.
ఒంటెలు ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో ఉంటాయి. ఒంటెలు ఒకసారి నీళ్లు తాగి మూపురంలో నీటిని నిల్వ ఉంచుకుంటాయి. ఇలా కొన్ని నెలల పాటు అవి నీళ్లను తాగకుండా ఉండగలవు.
మొసళ్లు నీళ్లలోనే ఎక్కువగా సంచరిస్తాయి. కానీ వీటి శరీరంలో కొన్ని రకాలు హర్మోన్ లు ఉంటాయి. అందుకే మొసళ్లు కూడా నీళ్లు, ఫుడ్ లేకుండా నెలల తరబడి ఉండగలవు.
కప్పలు కూడా నీళ్లు తాగకుండా నెలల తరబడి ఉంటాయి. వీటి శరీరంలో కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉన్నాయి. అందుకే ఇవి కూడా నీళ్లను తాగకుండా జీవిస్తాయి.
తాబేళ్లు కూడా నీళ్లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా నెలపైన కన్పిస్తాయి. ఇవి కూడా నెలల తరబడి నీళ్లను తాగకుండా, ఫుడ్ తినకుండా ఉండగలవని చెబుతుంటారు.
పాములు నీళ్లలోను, భూమిపైన ఉండగలవు. పాములు కొన్నిసార్లు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఇవి కూడా నీళ్లు తాగుకండా, ఆహారం తీసుకొకుండా నెలల తరబడి ఉంటాయంట.
ఎలుగు బంట్లు కొన్ని ధ్రువప్రాంతాల్లో ఉంటాయి. మరికొన్ని మంచు ప్రాంతాల్లో ఉంటాయి. వీటి శరీరంలో ప్రత్యేకమైన కొవ్వుల నిల్వలు ఉంటాయంట. అందుకే ఇవి నీటిని తాగకుండా, ఆహారం తినకుండా నెలల తరబడి ఉండగలవు.
స్పైడర్ లు మన ఇళ్లలో కన్పిస్తాయి. ముఖ్యంగా ఎండ, వెలుతురు లేని చోట్ల సాలే పురుగులు గూడు కట్టుకుని ఆవాసం చేసుకుని ఉంటాయి. ఇవి నీళ్లు, ఫుడ్ లేకుండా నెలల పాటు ఉండగలవు.
పెంగ్విన్ లు కూడా అస్సలు ఫుడ్, నీళ్లు తినకున్న కూడా హయిగా ఉంటాయంట. వీటి శరీరంలో దీని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడి ఉంటాయంట. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)