Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ప్రస్తుతం లడ్డు వివాదం కాక రేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, చెపనూనెల వంటివి కలిపారంటూ బాంబు పేల్చారు. ఇది కాస్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ఈ క్రమంలో.. ఇప్పటికే చంద్రబాబు దీనిపై విచారణకుసిట్ ను సైతం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రాయిశ్చిత దీక్షను చేపట్టారు. ఈ క్రమంలో.. లడ్డు వివాదం మాత్రం దేశంలో పెద్ద దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
తిరుమల లడ్డు వివాదంపై అపోసిషన్ పార్టీలు సైతం.. అదే రేంజ్ లో సైతం కౌంటర్ ఇస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ.. దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్.. సెప్టెంబర్ 28 న తిరుమల పర్యటన చేస్తానంటూ ప్రకటించారు. దీంతో ఇది మరోక వివాదం మారింది. శ్రీవారి దర్శనం ముందు.. జగన్ తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాలని కూడా అపోసిషన్ పార్టీలన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రేపు జగన్ పర్యటన వేళ ఏం జరుగుతుందో అని హైటెన్షన్ గా మారింది.
ఈ క్రమంలో.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు తెలుస్తోంది. జిల్లాలో పోలీస్ యాక్ట్ విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
అక్టోబరు 25 వరకు.. నిరసనలు, సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు పొలిటికల్ గా కూడా ప్రకంపనలకు కారణమైంది. ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణకర్ రెడ్డి సైతం.. తిరుమలలో ప్రమాణం చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం మరోసారి జగన్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా అదనపు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు కావాలని తిరుమలను తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని కొంత మంది ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.