Tirumala Tirupati Devasthanam Alert: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ముఖ్యంగా నడకదారిన వెళ్లే భక్తులను కేవలం గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. తిరుమల ఏడో మైలు రాయి వద్ద నిన్న చిరుత సంచారం నేపథ్యంలో ఈ భద్రత చర్యలు చేపట్టారు.
తిరుమల వెళ్లే భక్తులు ముందుగా ఈ విషయం తెలుసుకోండి. నడక మార్గంలోని ఏడో మైలు రాయి వద్ద నిన్న చిరుత సంచారం నేపథ్యంలో భద్రత చర్యలు చేపట్టింది టీటీడీ. ఈ మేరకు భక్తులను గుంపుగా అనుమతిస్తున్నారు.
వారి వెంట తిరుమల అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తులకు సిబ్బంది కూడా వెళ్తున్నారు. గుంపులో వంద మంది వరకు అనుమతిస్తున్నారు. వీరి వెంట నలుగురు భద్రత సిబ్బంది వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లిన వెంటనే మరో టీమ్ భక్తుల వెంట వెళ్తున్నారు.
అయితే, సీసీ కెమెరాలు, ట్రాప్‌లలో చిరుత ఆనవాళ్లు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుతను పట్టుకోవడానికి చర్యలు కూడ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు గస్తీ కూడా నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా నిన్న తిరుమల ఏడవ మలుపు వద్ద చిరుత సంచారం కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళ నడకమార్గంలో వెళ్లకూడదని సూచించింది. ఇది కాకుండా పిల్లలను మధ్యాహ్నం దాటిన తర్వాత అనుమతించడం లేదు.
ముఖ్యంగా రాత్రి 9 గంటలు దాటిన వెంటనే తిరుమల నడక మార్గం దారి మూసివేయనున్నారు. తిరుమల టోకెన్లను ఏపీ టూరిజం ద్వారా విక్రయించనున్నారు. దీనిపై త్వరలో టీటీడీ క్లారిటీ ఇవ్వనుంది. దీంతో టోకెన్లు బ్లాక్‌లో విక్రయించే అవకాశం ఉండదు. భక్తులకు అదనపు భారం ఉండదు.