Tirumala Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను జారీ చేయనుంది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గతంలో తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించే నిర్ణయం ఇటీవలె తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంతో తిరుమల స్థానిక భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించనుంది టీటీడీ.
ప్రతివారం మంగళవారం రోజు తిరుమల స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం ఈ నెల 3వ తేదీ నుంచి ముహూర్తం ఖరారు చేశారు. ఈ టోకెన్లు పొందడానికి డిసెంబర్ 1వ తేదీ ఆదివారం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం నుంచి టిక్కెట్లు జారీ చేయనున్నారు.
ఈ విధానం గతంలో ఉండే కానీ, కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. స్థానికుల అభ్యర్థనతో ఈ విధానాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఈ ప్రత్యేక దర్శనంతో తిరుమల, చంద్రగిరి, రేణిగుంటకు చెందిన భక్తులకు ఈ దర్శన అవకాశాన్ని కల్పించనున్నారు.
ఇదిలా ఉండగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు దాదాపు పది రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 2025 జనవరి 10వ తేదీ నుంచి 19 వరకు భక్తులకు ఉత్తరా ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే టీటీడీ పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.
ప్రతినెలా మూడు నెలలకు ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ యంత్రాంగం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ నెల 18 నుంచి ఫిబ్రవరి కోటా టిక్కెట్లను విడుదల చేసింది. అప్పుడే గదులు బుకింగ్ సౌకర్యం కూడా కల్పించింది.