Tirumala: ఎంతకు తెగించార్రా..?.. తిరుమలలో బైట పడ్డ మరో షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?


Tirupati news: తిరుమలలో ఇటీవల చోటు చేసుకుంటున్నఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మాత్రం తిరుమలకు పూర్వవైభవం వచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది.

1 /6

గత కొన్నిరోజులుగా తిరుమల ఏదో ఒక అంశంతో తరచుగా వార్తలలో ఉంటుంది. మెయిన్ గా తిరుమల లడ్డు కల్తీ అంశం మాత్రం కోట్లాది శ్రీవారి భక్తులను కలవరపెట్టిందని చెప్పుకొవచ్చు. ఈ అంశం రాజకీయంగా కూడా కాకరేపేది మారింది. దీనిపై కూటమి సర్కారు సీరియస్ గా చర్యలు తీసుకుంది.

2 /6

ఇదిలా ఉండగా.. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పాలనలో మరింత స్పీడు ను పెంచారు. ఆయన గతంలో ప్రభుత్వాలు తిరుమల ప్రతిష్టను భంగంకలిగే విధంగా చేసిన పనుల్ని ప్రజల ముందుంచుతున్నారు.  

3 /6

అదే విధంగా టీటీడీ హిందువులు ఉండాలని, అన్యమతస్తులు ఇతర డిపార్ట్ మెంట్ లకు బదిలీపై వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతే కాకుండా.. తిరుమల పవిత్రను కాపాడేలా.. సామాన్యుడికి శ్రీవారి దర్శనం తక్కువ సమయంలో అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు

4 /6

ఈ నేపథ్యంలో తాజాగా..తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా టీటీడీ విడుదల చేసే వీఐపీ బ్రేక్ టిక్కెట్లలో అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తొంది.

5 /6

ఈ నేపథ్యంలో దీనిపై నిఘాపెట్టిన అధికారులు.. ఒకే రోజు ఓ శాశ్వత ఉద్యోగికి  18 వీఐపీ బ్రేక్ టిక్కెట్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. అదే విధంగా.. మళ్లీ అదే కార్పొరేషన్ ఉద్యోగికి 2 టిక్కెట్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు ఉద్యోగి లీవ్ లో ఉన్నప్పటికీ ఆయన ఐడి కార్డు పై రెండు టిక్కెట్లు మంజూరు చేసినట్లు గుర్తించారు.  

6 /6

ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఘటనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. దీనిపై విజిలెన్స్ అధికారులు, టీటీడీ సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఒక నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం కలకలంగా మారింది.