Calcium Deficiency: 100 ఏళ్లు వచ్చినా నడుము నొప్పి రాదు.. కాల్షియం లేమి రాకుండా ఎముకలను ఉక్కులా మారుస్తుంది..!

Overcome Calcium Deficiency: ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ల్‌ చేర్చుకోవాలి. మన శరీరంలో కాల్షియం లేమి ఉన్నప్పుడు నడుం, మోకాళ్ల వంటి నొప్పులు వస్తాయి.దీనికి కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో చేర్చుకుంటే కాల్షియం లేమికి చెక్‌ పెట్టవచ్చు. ముఖ్యంగా అవిసె గింజలు తింటే ఎముకలు ఉక్కులా మారతాయి.
 

1 /7

ఫ్లాక్స్‌ సీడ్స్‌ అని కూడా పిలిచే అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగనివ్వకుండా గుండెకు మేలు చేస్తుంది. అవిసె గింజలు తరచూ తింటే ఆరోగ్యం కూడా మీ చెంతే..  

2 /7

అవిసె గింజలు తినడం వల్ల పళ్లు, ఎముకలు కూడా బలంగా మారతాయి. దీన్ని పొడి రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా కాల్షియం లేమితో బాధపడుతున్నవారు అవిసె గింజలు తినాలి.  

3 /7

జుట్టు బలంగా మారడానికి అవిసెగింజలు డైట్‌లో చేర్చుకుంటారు. వీటిని జెల్‌ మాదిరి తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేస్తారు. దీంతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా మెరుస్తుంది కూడా.  

4 /7

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. నాన్‌ వెజ్‌ తినలేని వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. అవిసెగిజంలతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు అవిసె గింజలు తీసుకోవాలి.  

5 /7

వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఆరబెట్టిన తర్వాత దోరగా వేయించి పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పది రోజులపాటు నిల్వ ఉంటుంది.  

6 /7

అవిసె గింజలు ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే ఇవి హార్మోన్‌ అసమతుల్యతకు కూడా చెక్‌ పెడుతుంది. మెదడుకు కూడా మేలు చేస్తుంది.  

7 /7

అవిసె గింజలు కీళ్లు, మోకాళ్లు, ఈరోజుల్లో ఎక్కువ సమయంపాటు పనిచేస్తుంటారు కాబట్టి నడుం నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటివారు తమ డైట్లో అవిసె గింజలు చేర్చుకోవడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు.