Sitaram Yechury: ఇందిరా గాంధీనే ఎదిరించిన యోధుడు.. ఎర్ర దళపతి సీతారాం ఏచూరి

Top 10 Secrets Of Sitaram Yechury: భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి మృతితో కమ్యూనిస్టు సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీతారాం ఏచూరి పక్కా తెలుగు వ్యక్తి కాగా ఆయన బాల్యం చెన్నై.. యవ్వనం తెలంగాణ అనంతరం ఢిల్లీకి పరిమితమయ్యారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇవే.

1 /10

Sitaram Yechury Secrets: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీతారాం ఏచూరి స్వస్థలం ఏపీలోని కాకినాడ వాస్తవ్యుడు. 12 ఆగస్టు 1952లో జన్మించారు.

2 /10

Sitaram Yechury Secrets: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీతారాం ఏచూరి స్వస్థలం ఏపీలోని కాకినాడ వాస్తవ్యుడు. 12 ఆగస్టు 1952లో జన్మించారు.

3 /10

Sitaram Yechury Secrets: ఏచూరి పూర్తి పేరు సర్వేశ్వర సోమయాజుల ఏచూరి. హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీలో విద్యాభ్యాసం చేశారు.

4 /10

Sitaram Yechury Secrets: ఈయన చదువుల్లో దిట్ట అయిన సీతారం ఏచూరి ఎక్కడా చదివినా ముందు స్థానంలో ఉండేవారు. హైదరాబాద్, ఢిల్లీ చదివిన అన్ని కోర్సుల్లో టాప్ లో నిలిచారు.

5 /10

Sitaram Yechury Secrets: సీతారాం ఏచూరికి ఇద్దరూ భార్యలు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌.

6 /10

Sitaram Yechury Secrets: ఏచూరి రెండో భార్య జర్నలిస్ట్‌ సీమ చిస్తీ. ఈమె ప్రముఖ ఆంగ్ల పత్రిక ది వైర్‌కు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్‌ కందాకు ఏచూరి మేనల్లుడు.

7 /10

Sitaram Yechury Secrets: చదువుతున్న క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. అప్పటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన అనంతరం సీపీఐ (ఎం)లో చేరారు.

8 /10

Sitaram Yechury Secrets: ఢిల్లీలోని జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం ఏచూరి 1977లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఇంటిని ముట్టడించారు. ఆందోళనకు స్పందించి బయటకు వచ్చిన ప్రధాని ఇందిర ముందు స్పష్టంగా విద్యార్థుల డిమాండ్‌లను చెప్పిన యువ నాయకుడు సీతారాం ఏచూరి.

9 /10

Sitaram Yechury Secrets: జాతీయ రాజకీయాల్లో ఫుల్‌ బిజీగా ఉన్న సీతారాం ఏచూరి ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

10 /10

Sitaram Yechury Secrets: 'లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌' పేరిట ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసాలు రాశారు. 'క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే', 'సోషలిజం ఇన్‌ చేంజింగ్‌ వరల్డ్‌', 'మోదీ గవర్నమెంట్‌: న్యూసర్జ్‌ ఆఫ్‌ కమ్యూనిజం', 'కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం' వంటి పుస్తకాలు సీతారా ఏచూరి రాశారు.