Uidai Aadhar Recruitment 2025: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ సేవ సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్ పాన్‌ అయితే రూ.50 వేల జీతం!

Uidai Aadhar Recruitment 2025 Jobs Apply Here: రెండు తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు అద్భుతమైన శుభవార్త.. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ మంచి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఆధార్ సేవా కేంద్రాలలో ఉన్న పలు ఖాళీలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే ఆధార్‌ కేంద్రాల్లో ఖాళీ ఉన్న ఆధార్ ఆపరేటర్, ఆధార్ సూపర్వైజర్ పోస్టులకు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ఈ UIDAI సంస్థ విడుదల చేసిన రెండు విభాగాల్లోని జాబ్‌లకు సంబంధించిన జీతాలను కూడా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రతి నెల జీతం రూ.50,000 పైగా ఉండబోతున్నట్లు తెలిపింది. ఇక ఉద్యోగాల అర్హత వివరాల్లోకి వెళితే.. కేవలం ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు ఇంటర్మీడియట్ పాసై ఉంటే చాలు..  

2 /5

ఈ ఉద్యోగాలు పొందిన వారు CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కింద ఉండే ఆధార్ సేవా కేంద్రాలలో పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి UIDAI సంస్థ కేవలం రెండు విభాగాల్లో మాత్రమే జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. త్వరలోనే ఇతర విభాగాల్లో కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.   

3 /5

ఇక రాష్ట్రాల వారిగా ఉద్యోగాల సంఖ్య చూస్తే.. తెలంగాణాలో 16 పోస్టులకు ఖాళీలు ఉండగా..  ఆంధ్రప్రదేశ్‌లోకి వివిధ జిల్లాల్లో 8 పోస్టులకు ఖాళీలకు భర్తీ చేయబోతోంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జిల్లాల వారిగా ఖాళీల సంఖ్యను కూడా వెళ్లడించింది.   

4 /5

స్పెషల్‌గా UIDAI సంస్థ ఈ పోస్టులకు నోటిఫికేషన్‌లో విద్యార్హతలు కూడా పేర్కొంది. దీనిని దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి అప్లై చేసుకునేవారు కనీసం వయస్సు 18 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది.  

5 /5

ఇక ఈ UIDAI సంస్థలకు సంబంధించిన వేతనాల వివరాల్లోకి వెళితే.. కనీస వేతం రాష్ట్ర సర్కార్‌ నిర్ణయిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఉద్యోగాల దరఖాస్తులో భాగంగా ఏ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాల్లోనే అప్లై చేసుకోవచ్చు.